AP Legislative Council Approves Various Bills: ఏపీ అబ్కారీ సవరణ బిల్లు 2024ను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. స్వదేశంలో తయారైన విదేశీ మద్యం, విదేశీ మద్యం వ్యాపార క్రమబద్దీకరణ సవరణ బిల్లు 2024ను మంత్రి కొల్లు సభలో ప్రవేశపెట్టారు. ఏపీ మద్య నిషేధ సవరణ బిల్లు 2024ను కూడా మంత్రి శానసభలో ప్రవేశపెట్టారు. వీటిని సభ ఆమోదించింది.
ఏపీ సహకార సంఘాల సవరణ బిల్లు 2024ను మంత్రి అచ్చెన్నాయుడు శాసనభలో ప్రవేశపెట్టారు. రైతు భరోసా కేంద్రాల వల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు లింకు తెగిపోయిందని పీఏసీఎస్‌కు మార్కెట్ కమిటీల అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ సవరణ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ లోటును పూడ్చేలా కార్యాచరణ చేపట్టామని మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభకు తెలిపారు. డీసీసీబీలు ఇతర సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి ముగ్గురు పిల్లల నిబంధనను తొలగిస్తూ కూడా సవరణ చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఈ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
తాడేపల్లి ఇంట్లో జగన్ - అసెంబ్లీకి సునీత - ఆ ప్రశ్నకు త్వరలోనే సమాధానం?!
దేశంలో ఎక్కడా లేని పథకం ఇది - కోటిన్నర మందికి లబ్ధి : మంత్రి నాదెండ్ల