AP High Court Orders : హైకోర్టు న్యాయమూర్తులు, ట్రయల్ కోర్టు న్యాయాధికారిపై సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో ఉంచిన అభ్యంతరకర పోస్టులను తొలగించాలని గూగుల్ ఎల్‌ఎల్‌సీ (Google LLC)ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. మరో వైపు తాము తొలగించామని ఆన్‌లైన్ సామాజిక మాధ్యమ సంస్థలు ఫేస్‌బుక్, ఎక్స్ చెప్పిన వివరాలను నమోదు చేసింది. ఏజీ అభ్యర్థన మేరకు శ్రేయ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (టీవీ5), మహా న్యూస్ (Mahaa News), మైరా మీడియా సంస్థ (Myra Media Company)లను ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులు మరికొందరికి నోటీసులు అందజేయాల్సిన అవసరం ఉందని, కొంత సమయం ఇవ్వాలని ఏజీ శ్రీరామ్ (AG Sriram) అభ్యర్థన మేరకు విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గా ప్రసాదరావు, జస్టిస్ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
న్యాయవ్యవస్థను దూషిస్తూ పోస్టులు పెడితే సహించేది లేదు: హైకోర్టు
AP High Court orders to Google LLC : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) విషయమై న్యాయస్థానాలు ఉత్తర్వుల వెల్లడి అనంతరం న్యాయమూర్తులు, న్యాయాధికారిని అవమానపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ దాఖలు చేసిన క్రిమినల్ కోర్టు ధిక్కరణపై హైకోర్టు విచారణ జరుపుతుంది. గతంలో 26 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. అభ్యంతరకర యూఆర్‌ఎల్‌లను యూట్యూబ్ తొలగించలేదని ఏజీ వాదనలు వినిపించారు. తాము దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును హైకోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకున్నాక (కాగ్నిజెన్స్) సామాజిక మాధ్యమ సంస్థలు వాటంతట అవే అభ్యంతరకర పోస్టులను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Posts on Judges Case : న్యాయమూర్తులపై పోస్టుల కేసులో ఇద్దరిని విచారించిన సీబీఐ
Posts on Judges Case : గూగుల్ ఎల్‌ఎల్‌సీ(యూట్యూబ్) తరఫున సీనియర్ న్యాయవాది సజన్ పువయ్య స్పందిస్తూ కోర్టు ఆదేశాలు లేదా కేంద్ర ప్రభుత్వం నియమించిన డిజిగ్నేటెట్ అధికారి ఉత్తర్వులు జారీ చేస్తే తొలగిస్తామని తెలిపారు. కోర్టు ఆదేశిస్తే ఆరు అభ్యంతరకర యూఆర్‌ఎల్‌లను తొలగించేందుకు సిద్ధమని అన్నారు. ఇరువైపు వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం యూట్యూబ్‌లో ఉన్న అభ్యంతరకర పోస్టులను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
న్యాయమూర్తిపై ఫేస్బుక్లో తప్పుడు పోస్టులు.. సీబీఐ అదుపులో వ్యక్తి!