AP High Court on YS Sunitha And Btech Ravi Petition : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వుల ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్వర్వలను సవాలు చేస్తూ వివేకా కుమార్తె వైఎస్ సునీత, పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకుంది. ఈ వ్యాజ్యాలు తగిన బెంచ్ వద్దకు విచారణకు వచ్చేలా ఫైళ్లను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని బుధవారం ఆదేశించింది.
వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న ఏ కేసుల గురించి మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సునీత, బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాలు బుధవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎన్ విజయ్‌తో కూడిన ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చాయి. వేరే బెంచ్ వద్దకు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకునేందుకు ఫైళ్లను సీజే వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
TDP Leader BTech Ravi Petition on High Court: మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు అంశంపై ఎవరు మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వైఎస్సార్ జిల్లా పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి ఈ నెల 23న హైకోర్టులో లంచ్‌మోషన్ అప్పిల్ చేశారు. లంచ్‌మోషన్ పిటిషన్‌ను విచారించలేమని ఈ నెల 24 మరో ధర్మాసనం చేపడుతుందని బెంచ్ పేర్కొంది. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమని పిటీషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం బ్లూమ్ బర్గ్‌కేస్‌లో ఇచ్చిన తీర్పుకు ఇది పూర్తి విరుద్ధమని పిటిషనర్ తెలిపారు.
ఎన్నికల సందర్భంగా వివేకా హత్య కేసుపై పలువురు రాజకీయ నాయకులు ప్రచారంలో మాట్లాడుతున్నారని వైసీపీ కడప పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సురేష్ బాబు కోర్టులో వేసిన పిటిషన్‌పై 30వ తేదీ వరకు ఎవరూ మాట్లాడవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. ప్రధానంగా వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని పిటిషన్ వేయగా వారందరూ వివేకా అంశాన్ని ప్రస్తావించవద్దని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
కడప కోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తా: సునీత - Sunitha on Kadapa Court Order
వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీటులో చేర్చినా నేటివరకూ న్యాయం జరగలేదని సునీత అన్నారు. ప్రజాకోర్టులో న్యాయం పొందే అవకాశం ఉండటంతో అడుగుతున్నామన్నారు. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు కర్నూలు వచ్చినప్పుడు సీబీఐ పని సాఫీగా జరిగి ఉంటే అవినాష్‌రెడ్డిని జగన్ కాపాడకపోయి ఉంటే కేసుకు న్యాయం జరిగి ఉంటే హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్షలు పడి ఉంటే ఈ రోజు మేము రోడ్డు మీదకు వచ్చే అవసరమే ఉండేది కాదన్నారు.
ఐదు సంవత్సరాలు వేచి చూసినా మాకు న్యాయం జరగలేదని అందుకే ప్రజా తీర్పు కోసం ప్రజాకోర్టులో కొంగుచాచి న్యాయం అడుగుతున్నా ఇది తప్పెలా అవుతుంది? ప్రజల్నే తీర్పు చెప్పాలంటున్నాం. హత్య కేసులో నిందితులు వివేకా హత్యకు ముందు, హత్య తర్వాత కూడా అవినాష్‌రెడ్డిని కలిశారని గూగుల్ టేకౌట్ మ్యాప్‌ల ఆధారంగా తెలుస్తోందని సీబీఐ స్పష్టంగా చెప్పిందని షర్మిల అన్నారు.