ETV Bharat / state

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో బిగ్ ట్విస్ట్ - ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలన్న బాధితురాలు - AP HC on MLA Adimulam Case

HC on Adimulam Issue: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసులో హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని బాధితురాలు న్యాయస్థానానికి తెలిపింది. ఎమ్మెల్యేపై నమోదు చేసిన కేసు తప్పుడు కేసు అని న్యాయమూర్తికి వివరించింది. ఆదిమూలంపై కేసును కొట్టేయాలని కోరింది. ఈ విషయాలను పరిగణలోనికి తీసుకున్న ధర్మాసనం ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అనంతరం విచారణ ఈనెల 25కి వాయిదా వేసింది.

AP HC on MLA Adimulam Case
AP HC on MLA Adimulam Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 9:19 AM IST

AP High Court on MLA Adimulam Case : సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసులో శుక్రవారం హైకోర్టులో కీలక పరిణామం జరిగింది. ఫిర్యాదిదారు/బాధిత మహిళ స్వయంగా న్యాయస్థానానికి హాజరై ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్ని అవాస్తం అని న్యాయవాదితో నోటరీ చేసిన అఫిడవిట్‌ను కోర్టులో దాఖలు చేశారు.

హైకోర్టు సైతం ఫిర్యాదిదారు/ బాధిత మహిళతో మాట్లాడింది. వాస్తవాలను వివరిస్తూ అఫిడవిట్‌ వేశానని, ఆదిమూలంపై నమోదు చేసిన కేసు తప్పుడు కేసు అని తెలిపింది. దానిని కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. తగిన ఉత్తర్వులు జారీచేసే నిమిత్తం విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే.కృపాసాగర్‌ ఉత్తర్వులిచ్చారు.

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు - కేసు నమోదు - MLA Adimulam Suspended From TDP

తనను బెదిరించి ఎమ్మెల్యే ఆదిమూలం అత్యాచారం చేశారని తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన బాధితురాలు తిరుపతి తూర్పు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 64( అత్యాచారానికి శిక్ష), 351(2) (నేరపూర్వక బెదిరింపు) కింద తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు.

Adimulam Sexual Harassment Case : దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేశారని న్యాయస్థానానికి వివరించారు. మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్‌పై ఆ మహిళ ఫిర్యాదు చేశారని తెలిపారు. వలపు వల (హనీట్రాప్‌) జరిగిందని పేర్కొన్నారు. అత్యాచారం సెక్షన్‌ నమోదు చెల్లదని ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ధర్మాసనాన్ని కోరారు.

బాధిత మహిళ తరఫున న్యాయవాది కె.జితేందర్‌ వాదనలు వినిపించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలన్ని అవాస్తవం అంటూ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశామని తెలిపారు. దానిని పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యేపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు.

ప్రజలకు ప్రతిరోజూ రాజకీయ నేతల దర్శనం అవసరం లేదు: హైకోర్టు - AP HC on Illegal Hoardings

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.