AP Govt Plans to Create 20 Lakh Jobs : ఏపీ సర్కార్ నూతన పాలసీలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నాయి. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై బుధవారం జరిగే మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించింది. రానున్న ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన దిశగా ప్రణాళిక రూపొందించారు.
వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా నూతన విధానాన్ని రూపొందించారు. మొత్తం 10 శాఖల్లో నూతన పాలసీలను అధికారులు సిద్ధం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలతో పలు శాఖల్లో నూతన విధానాలపై కసరత్తు కొలిక్కి వచ్చింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రక్రియను అమల్లోకి తెచ్చేలా కొత్త పాలసీల రూపకల్పన చేశారు. జాబ్ ఫస్ట్ (ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యం) అనే ముఖ్య లక్ష్యంతో ప్రభుత్వం పాలసీలను సిద్దం చేసింది.
ఏపీ కేబినెట్ ముందుకు 6 కొత్తపాలసీలు? : పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, పొరుగు రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలతో నూతన పాలసీలు రూపొందించారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు దాదాపు 6 ప్రభుత్వ నూతన పాలసీలు వచ్చే అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు తదితర పాలసీలు క్యాబినెట్ ముందుకు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు.
ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10 శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని పారిశ్రామిక పాలసీలో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా ఇండస్ట్రియల్ ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంలో కసరత్తు చేశారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్‌తో సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల విధానాన్ని (ఎంఎస్ఎంఈ పాలసీ) ఏపీ ప్రభుత్వం తీసుకువస్తోంది. విద్యుత్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉండేలా క్లీన్ ఎనర్జీ విధానాన్ని రూపొందించారు.
భార్యాభర్తలుగా విడిపోయినా మోసం చేయడంలో మాత్రం కలిసే - నిరుద్యోగుల నుంచి లక్షలు దోచుకున్న మాజీలు
ఇంటర్ అర్హతతో రైల్వేలో జాబ్స్ - మొదటి నెల నుంచే రూ.40 వేల శాలరీ - చివరి తేదీ ఎప్పుడంటే?