ETV Bharat / state

20 మంది విప్​లు - అన్ని వర్గాలకు సముచిత న్యాయం! - AP ASSEMBLY WHIPS

శాసనసభ, శాసనమండలి చీఫ్‌ విప్‌లు, విప్‌లను ప్రకటించిన ప్రభుత్వం - ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు పేరును ఖరారు చేసిన చంద్రబాబు

AP Assembly and Legislative Council Whips Finalized
AP Assembly and Legislative Council Whips Finalized (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 8:52 AM IST

AP Assembly and Legislative Council Whips Finalized : ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న శాసనసభ, శాసనమండలి చీఫ్‌ విప్‌, విప్‌లను ప్రభుత్వం ప్రకటించింది. రికార్డు స్థాయిలో 20 మందికి అవకాశం కల్పించింది. శాసనసభలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మండలిలో చీఫ్‌ విప్‌గా పంచుమర్తి అనురాధలను నియమించింది. ఉపసభాపతిగా రఘరామకృష్ణరాజు నియమితులు అయ్యారు.

ఉపసభాపతిగా రఘరామకృష్ణరాజు : రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా రఘరామకృష్ణరాజు పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ నేడో, రేపో విడుదల కానుంది. గతంలో వైఎస్సార్సీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలుపొందిన రఘురామ ఆ తర్వాత పార్టీకి దూరంగా జరిగారు. జగన్ అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగట్టారు. దీనిపై ఆగ్రహించిన అప్పటి వైఎస్సార్సీపీ సర్కార్‌ రఘురామపై రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరిన ఆయన ఉండి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనను ఉపసభాపతిగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు.

శాసనసభ, మండలిలో చీఫ్‌ విప్‌లు, విప్‌లు వీరే

రికార్డు స్థాయిలో 20 మందికి అవకాశం : గతంలో ఎన్నడూ లేని విధంగా శాసనసభలో చీఫ్‌ విప్‌ సహా విప్‌లుగా 16 మందిని, శాసన మండలిలో చీఫ్‌ విప్‌ సహా నలుగురిని విప్‌లుగా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర విభజన తర్వాత మొదట్లో ఒక చీఫ్‌ విప్, నలుగురు విప్‌లు ఉండేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చీఫ్‌ విప్‌తో సహా విప్‌ల సంఖ్యను తొమ్మిదికి పెంచింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ సంఖ్యను ఏకంగా 20కి తీసుకెళ్లింది. మూడు పార్టీల నుంచి అత్యధికంగా 164 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం, పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉండటంతో పాటు మిత్రపక్షాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాల్సి రావడంతో ఎక్కువ మందిని విప్‌లుగా ప్రభుత్వం నియమించింది. మిత్రపక్షాలైన జనసేనకు శాసనసభలో 3, శాసన మండలిలో ఒక విప్‌ పదవులు కేటాయించగా బీజేపీకి శాసన సభలో ఒక విప్ పదవి ఇచ్చారు.

  • రాజకీయ, సామాజిక సమీకరణాల బేరీజుతో చీఫ్‌ విప్‌లు, విప్‌ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. పల్నాడు జిల్లా నుంచి మంత్రి మండలిలో ఎవరికీ చోటు దక్కకపోవడం సీనియర్‌ నాయకుడు జీవీ ఆంజనేయులకు అవకాశం దక్కింది.
  • వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపొందిన పంచుమర్తి అనురాధకు మండలిలో చీఫ్‌ విప్‌ పదవి దక్కింది. బీసీ సామాజికవరానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసి వచ్చింది. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి అత్యధికంగా ముగ్గురికి అవకాశం లభించింది. ఈ జిల్లా నుంచి పంచుమర్తి అనురాధ, బొండా ఉమ, తంగిరాల సౌమ్యలకు పదవులు దక్కాయి.
  • కడప జిల్లా నుంచి ఆదినారాయణరెడ్డి, రెడ్డప్పగారి మాధవిలకు పదవులు దక్కాయి. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 8 మందికి శాసనసభలో విప్‌లుగా పదవులు దక్కాయి. శాసనమండలిలో చీఫ్‌ విప్, విప్‌లు నలుగురూ తొలిసారి ఎన్నికైనవారు కావడం విశేషం.

మొత్తం 20 మందిలో బీసీ సామాజికవర్గానికి చెందిన ఏడుగురికి అవకాశం దక్కింది. వారిలో శాసనసభలో ఐదుగురు ఉన్నారు. శాసనమండలి చీఫ్‌ విప్‌ పదవితో పాటు, ఒక విప్‌ పదవిని బీసీలకు కేటాయించారు. శాసనసభలో ఎస్సీ వర్గానికి చెందిన ముగ్గురికి, ఎస్టీలు ఒకరికి విప్‌లుగా అవకాశం కల్పించారు. చీఫ్‌ విప్‌లకు కేబినెట్‌ హోదా, విప్‌లకు సహాయ మంత్రి హోదా ఉంటుంది.

డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు - ఏకగ్రీవంగా ఎన్నుకోనున్న అధికార కూటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.