AP Govt Taking key Decisions to Speed up Governance: పాలనలో వేగం పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థిక, ఆర్థికేతర అంశాలను విభజించి పరిష్కారంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. మొత్తంగా 49 అంశాల్లో ఆర్థికేతర సమస్యలను అధికారులు గుర్తించారు. ఆర్ధిక పురోగతిలో భాగంగా 24 పాలసీలు రూపొందించే దిశగా ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్రాభివృద్ధి, విజన్ డాక్యుమెంట్లు, గ్రోత్ పాలసీలో భాగంగా విధాన పత్రాల రూపకల్పన చేయనుంది. ఆర్థికేతర అంశాల పరిష్కారం, పాలసీల రూపకల్పనపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ శాఖలకు సీఎస్ ఆదేశాలు జారీ చేసారు. ఈ నెల 30వ తేదీలోగా తీసుకున్న చర్యలు, పాలసీల రూపకల్పన వివరాలను సమర్పించాలని సీఎస్ నీరభ్ సూచించారు. వచ్చే కెబినెట్ భేటీలో ఆర్థికేతర అంశాల పరిష్కారం, విధానాల రూపకల్పనపై చర్చ ఉంటుందని సీఎస్ కార్యాలయం స్పష్టం చేసింది.
కడియపు లంక నర్సరీలోని ఈ మొక్కపై రతన్ టాటాకు ఆసక్తి - స్వయంగా కలిసిన రైతులు
"ఇదేందయ్యా ఇదీ!" ఆ దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు - మద్యం టెండర్లలో రింగ్ ?