ETV Bharat / state

విజయవాడలో వరదల నివారణ - డ్రైనేజీ వ్యవస్థ సమూల ప్రక్షాళనే మార్గం! - AP Govt Control Floods Vijayawada

AP Govt Control Floods in Vijayawada : వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నీటి పారుదల వ్యవస్థ సరిగా ఉండే ఇళ్లకు ముంపు ముప్పు ఉండదు. ఆ వ్యవస్థ సరిగాలేకే, పది రోజులపాటు బెజవాడ బెంబేలెత్తింది. నగర విస్తరణకు అనుగుణంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ఓపెన్‌ నాళాలు పూడిపోవడం వల్ల కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ సర్కార్ అటకెక్కించిన మురుగు కాల్వల ఆధునీకరణ పనులను కూటమి ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించాల్సిన అవశ్యకత ఏర్పడింది.

AP Govt Control Floods in Vijayawada
AP Govt Control Floods in Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2024, 7:37 AM IST

Drainage System Expansion in Vijayawada : ఇటీవల వర్షాలు, వరదలు బెజవాడలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను విస్తృతం చేయాల్సిన అవసరాన్ని చాటాయి. గత నెల 31, ఈ నెల 1న విజయవాడలో వర్షం కురిసింది. అప్పటికే వర్షం నీరు అనేక చోట్ల రోడ్లపై నిలిచింది. సైడ్ డ్రెయిన్లు, రోడ్లు ఏకమయ్యాయి. విజయవాడ నగర పాలక పరిధిలో 1.01 లక్షల ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఉండగా, కనెక్షన్లు లేని నివాసాలు 1.09 లక్షలు ఉన్నాయి. చాలా మంది ఇండ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు తీసుకోలేదు. అనేక చోట్ల నేటికీ ఓపెన్‌ డ్రెయిన్లే ఉన్నాయి. అవికూడా గత ఐదేళ్లూ సరైన నిర్వహణలేక పూడిపోయాయి.

'వర్షాలు పడినప్పుడు నీరు వెళ్లేందుకు ఏర్పాట్లు లేకపోవడంతో మురుగు కాల్వల నుంచి వరద బయటికి వస్తుంది. ఈ ప్రభావంతో బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, ఆటోనగర్ వందడుగల రోడ్డు, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సర్వీసు రోడ్డు, మహానాడు రోడ్డు, గుణదల వంటి వివిధ కాలనీల రోడ్లను మురుగు ముంచెత్తుతోంది. ఆ సమయంలో బయటికి రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.' -స్థానికులు

Vijayawada Sewerage Modernization Works : 2014-2019 మధ్య అప్పటి తెలుగుదేశం సర్కార్ విజయవాడ నగరపాలిక పరిధిలో మురుగు కాలువల ఆధునీకరణ పనులు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రూ. 462 కోట్ల నిధులు రాబట్టింది. పనులు సైతం ప్రారంభించింది. సుమారు రూ. 200 కోట్ల విలువైన పనులూ పూర్తి చేయించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక డ్రైనేజీ పనులకు మంగళం పాడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేడు మళ్లీ డ్రైనేజీ వ్యవస్థకు ఓ పరిష్కారం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.

దుర్వాసన నుంచి విముక్తి- కూటమి రాకతో శ్రీకాకుళం మున్సిపాలిటీలో వేగంగా పారిశుద్ద పనులు - Srikakulam Drainage Cleaning Works

బహుముఖ వ్యూహం కావాలి : ఓ మాదిరి వర్షానికే విజయవాడలోని వీధులన్నీ కాలువల్లా ప్రవహిస్తుంటాయి. బుడమేరు ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుంది. కృష్ణానదికి భవిష్యత్​లో భారీ వరదలు పోటెత్తవన్న గ్యారంటీ లేదు! వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం కావాలి. దీర్ఘకాలిక ప్రణాళిక, సన్నద్ధత కావాలి. యుద్ధప్రాతిపదికన కార్యాచరణకు సిద్ధమవ్వాలి. వీటన్నింటికీ రూ.10,000ల కోట్లు ఖర్చయినా సర్కార్ అత్యంత ప్రాధాన్యంగా భావించి చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలి. అవసరమైతే ప్రపంచబ్యాంకు వంటి సంస్థల రుణ సహకారంతో ఈ ప్రాజెక్టుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.

మురికికూపంగా ఆధ్యాత్మిక నగరం - అడుగు తీసి బయట పెట్టలేకున్న తిరుపతి ప్రజలు - Worst Sanitation in Tirupati

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.