ETV Bharat / state

స్టీల్​ ప్లాంటు నష్టాల్లో ఉందా? - ఏపీ సీఎం జగన్​ ఆశ్చర్యం - మళ్లీ గెలిపించండి లాభాల్లోకి తెద్దాం - JAGAN ON VISAKHA STEEL PLANT - JAGAN ON VISAKHA STEEL PLANT

AP CM Jagan on Visakha Steel Plant Privatization : ఏపీలోని విశాఖ ఉక్కుకు జగన్‌ మోహన్ రెడ్డి మళ్లీ మొండిచేయి చూపించారు. 'స్టీలు ప్లాంటు నష్టాల్లో ఉందా?' అంటూ ఏమీ తెలియనట్లు కార్మికసంఘాల నేతలను ఆయన ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. బస్సుయాత్రలో భాగంగా విశాఖలోని ఎండాడలో జగన్‌ బస చేసిన శిబిరం వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, అధికార సంఘం ప్రతినిధులు కొందరు ఆయనను మంగళవారం కలిశారు.

CM Jagan on Visakha Steel Plant Privatization

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 2:40 PM IST

AP CM Jagan on Visakha Steel Plant Privatization : ఏపీలోని విశాఖ ఉక్కుకు జగన్‌ మోహన్ రెడ్డి మళ్లీ మొండి చేయి చూపించారు. 'స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?' అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. ఆర్థికసాయం, సెయిల్‌లో విలీనం గురించి చెప్పేందుకు మూడేళ్లుగా కార్మిక, అధికారసంఘాల ప్రతినిధులు జగన్‌ను కలవాలని ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. కానీ, ఎన్నికల వేళ మంత్రి అమర్‌నాథ్‌ ద్వారా స్టీలుప్లాంటు కార్మికసంఘాల నేతలను పిలిపించారు. బస్సుయాత్రలో భాగంగా విశాఖలోని ఎండాడలో జగన్‌ బసచేసిన శిబిరం వద్ద ఉక్కు పరిరక్షణ పోరాటసమితి, అధికార సంఘం ప్రతినిధులు కొందరు ఆయనను మంగళవారం కలిశారు.

CM Jagan Response On Steel Plant Issue : విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్‌ స్టీలుప్లాంటు వ్యవహారంపై స్పందించిన తీరుకు కార్మిక నేతలు నివ్వెరపోయారు. 'టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని ఓడించి గాజువాకలో అమర్‌నాథ్‌ను గెలిపించండి. వైసీపీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు స్టీలుప్లాంటు సంగతి చూస్తా' అని జగన్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. గాజువాకలో వామపక్షాల అభ్యర్థి జగ్గునాయుడితో విత్‌డ్రా చేయించి అమర్‌నాథ్‌కు మెజారిటీ తెప్పించి అప్పుడు ప్లాంటు గురించి అడగాలని సూచించినట్లు సమాచారం.

ఇనుప ఖనిజం ఒడిశానుంచి తెప్పించవచ్చు : రాష్ట్రంలో స్టీలుప్లాంటుకు ఉన్న గర్భాం మాంగనీస్‌ గనులు, సారపల్లిలోని సిలికాన్‌ శాండ్‌ అనుమతుల గడువు పెంచాలని కార్మికసంఘాల నేతలు జగన్‌ను కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ 'స్టీలుప్లాంటులో ఇనుప ఖనిజం ఎక్కువ వాడతారు. తక్కువ వాడే మాంగనీస్‌, సిలికాన్‌ గురించి ఎందుకు? అది చిన్న అంశం' అంటూ గనుల లీజు పొడిగింపుపై ఏమీ చెప్పకుండా దాటేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఉక్కు పరిశ్రమకు అవసరమైన ఇనుప ఖనిజం ఒడిశా నుంచి తెప్పించవచ్చని జగన్‌ తెలిపారు.

విశాఖ ఉక్కు ఊపిరి తీశారు - మెడలు వంచుతామని కేంద్రం ముందు సాగిలపడ్డ జగన్

అయ్యో స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా? : అధికారంలోకి వస్తే ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సీఎంలతో మాట్లాడి ప్రత్యేక గనులు కేటాయించేలా చేస్తానని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. జీవీఎంసీ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి స్టీలుప్లాంటు కోసం పాదయాత్ర చేశారు. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ప్రైవేటీకరణ ఆపడానికి ఎంపీలతో సంతకాలు చేయించామంటూ ఓ లేఖను వెలుగులోకి తెచ్చి వైవీ సుబ్బారెడ్డి డ్రామాలాడారు. గత 1,300 రోజులుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఆర్థికసాయం చేయాలని, సెయిల్‌లో విలీనం చేయాలంటూ కార్మిక సంఘాలు ఉద్యమం చేస్తున్నాయి.

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్ల ఆర్థికసాయం చేయాలని జగన్‌ను కోరాయి. ఇవన్నీ తెలిసి కూడా కార్మిక సంఘాలు 'ప్లాంటులో జీతాలివ్వని పరిస్థితి నెలకొంది' అని కార్మిక సంఘాలు చెప్పగానే 'అయ్యో స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?' అంటూ తిరిగి ప్రశ్నించడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురి చేసింది. మిగులు భూములు అమ్ముకుంటే నష్టాల నుంచి ప్లాంటు గట్టెక్కుతుందని ఒక ఉచిత సలహా సైతం ఇచ్చారట.

CM Jagan on RINL Pending Bills : విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, వాయిదాల పద్ధతిలో ఆర్‌ఐఎన్‌ఎల్‌ బకాయిలు చెల్లిస్తుందని, దానికి సహకరించాలని జగన్‌ను కార్మిక, అధికారసంఘ ప్రతినిధులు కోరారు. 'డిస్కంకు రూ.లక్ష కోట్ల అప్పు ఉంది. మీరు కట్టకపోతే ఎలా?' అంటూ జగన్‌ స్పందించారు.

Visakha Steel Plant Land Sale Commencement: విశాఖ స్టీల్ ప్లాంట్‌ భూముల విక్రయానికి మొదలైన ప్రక్రియ.. భూముల అమ్మకానికి త్రైపాక్షిక ఒప్పందం

Vizag Steel Plant: వైజాగ్​ స్టీల్​ప్లాంట్​ను తెలంగాణ కొనుగోలు చేయకుండా కేంద్రం మెలిక..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.