ETV Bharat / state

జగన్​పై దాడి ప్రమాదవశాత్తు జరిగిందనే అనుకుంటున్నాం : వైఎస్​ షర్మిల - AP CM JAGAN ATTACKED - AP CM JAGAN ATTACKED

AP CM Jagan Attacked Updates : బస్సు యాత్రలో ఏపీ సీఎం జగన్​పై జరిగిన దాడిని ప్రముఖ రాజకీయ నేతలు ఖండించారు. రాజకీయ విభేదాలు హింసకు దారి తీయకూడదని దీనిపై వెంటనే విచారణ జరపాలని కోరారు. కాగా ఎన్నికల ప్రచారానికి స్పందన కరవవడంతో కోడికత్తి 2.0కి తెరలేపారని టీడీపీ నేతలు విమర్శించారు.

Eminent Leaders Condemned the Attack on AP CM Jagan

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 11:35 AM IST

ఈ దాడి ప్రమాదవశాత్తు జరిగిందనే అనుకుంటున్నాము : వైఎస్​ షర్మిల

AP CM Jagan Attacked Updates : బస్సు యాత్రలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడిని పలువురు ప్రముఖులు ఖండించారు. సీఎం జగన్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కోరగా, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు దీనిపై సమగ్ర విచారణ జరపాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తెలిపారు. ప్రచారానికి స్పందన కరవవడంతో కోడికత్తి 2.0కి తెరలేపారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగిందనే అనుకుంటున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

Political Leaders Condemned Attack on AP CM Jagan : సీఎం జగన్‌ త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు. దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా, ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరుతున్నానన్నారు. రాజకీయ విభేదాలు హింసకు దారి తీయకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ (Tamil Nadu CM MK Stalin) హితవు పలికారు.

దాడిని ఖండించిన కేటీఆర్​ : జగన్‌ త్వరగా కోలుకోవాలని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ (Kalvakuntla Taraka Rama Rao) ఎక్స్‌లో ఆకాంక్షించారు. జగన్‌పై రాయి విసిరిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు నోటీసులు - చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల ఫలితం

స్పందన కోసమే ఇదంతా : జగన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి స్పందన కరవవడంతో కోడికత్తి 2.0కి తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) విమర్శించారు. సీఎం పర్యటన జరుగుతుంటే అదే సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా అని ప్రశ్నించారు.

సానుభూతి కోసం పాకులాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ (TDP MLA Payyavula Keshav) ఆరోపించారు. దాడి జరిగిన నాలుగు నిమిషాల్లోనే క్యాట్‌ బాల్‌ ఉపయోగించారని సాక్షి సహా జగన్‌ అనుకూల మీడియాకు ఎలా తెలిసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

AP Lok Sabha Election 2024 : తాడేపల్లి ప్యాలెస్‌ డైరెక్షన్‌లో డీజీపీ రాజేంద్రనాథరెడ్డి (DGP Rajendranath Reddy), ఇంటెలిజెన్స్‌ ఐజీ సీతారామాంజనేయులు ఆడిన నాటకంలో భాగంగానే దాడి జరిగిందని వర్ల రామయ్య ఆరోపించారు. దాడి జరిగితే డీజీపీ, నిఘా విభాగాధిపతి ఏం చేస్తున్నారని వంగలపూడి అనిత అనుమానం వ్యక్తం చేశారు.

ప్రమాదవశాత్తు జరిగిందనే అనుకుంటున్నాను : ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌కు ప్రమాదవశాత్తు గాయమైందని భావిస్తున్నానని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని జగన్‌కు గాయం కావడం బాధాకరమన్నారు.

అరాచక 'గ్రంథం' - గోదావరి జిల్లాల్లో పేట్రేగిపోతున్న వైసీపీ నేత

వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.