AP Cabinet On New Liquor Policy : ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తన సొంత పత్రిక సాక్షికి అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు, అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అనేక తప్పుడు విధానాలు అనుసరించారని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మండిపడింది. వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రికను కొనిపించేందుకు రెండు సంవత్సరాల్లోనే ప్రభుత్వ ఖజానా నుంచి రూ.205 కోట్లు వెచ్చించారని, ఇది ముమ్మాటికీ అధికార దుర్వియోగమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది.
మాజీ సీఎం జగన్ తన భార్య భారతి ఛైర్మన్‌గా ఉన్న పత్రికకు ప్రజాధనాన్ని దోచిపెట్టారని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించింది. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో సాక్షికి ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.443 కోట్లు దోచిపెట్టారని, మిగతా పత్రికలన్నింటికి కలిపి ఇచ్చింది కలిపినా కూడా ఇంత లేదని తెలిపింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది.
ఏ ప్రాతిపదికన సాక్షి పేపర్ కొనుగోలుకు ప్రభుత్వ నిధులు కేటాయించారు : జగన్ హయాంలో కొన్ని పత్రికలకు కక్షపూరితంగా ప్రకటనల బకాయిలు నిలిపేశారని చర్చకొచ్చింది. వాటిని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సాక్షి పత్రిక సర్క్యూలేషన్ ఎంత? ఏ ప్రాతిపదికను ఆ న్యూస్‌పేపర్ కొనుగోలుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది? ఏ నిబంధనల ప్రకారం అన్ని కోట్ల రుపాయల ప్రకటనలు అడ్డగోలుగా జారీ చేసిందన్న అంశంపై విచారణ జరిపించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
గ్రామ, వార్డు వాలంటీర్లకు గడువు 2023 ఆగస్టుతోనే ముగిసింది. జగన్ ప్రభుత్వం వారి సేవల్ని పునరుద్ధరించలేదని మంత్రివర్గం తెలిపింది. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలా? కొనసాగిస్తే ఇప్పుడున్నదాన్ని ఎలా క్రమబద్ధీకరించాలి వంటి అంశాలను వారి సమావేశం ఎజెండాలో చేర్చారు. రాజీనామాలు చేయని వాలంటీర్లకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల వేతం చెల్లించే అంశాన్ని మంత్రి వర్గం ఆమోదం కోసం ఉంచారు. దానిపై చర్చ సందర్భంగా గత ఆగస్టు నుంచి వారి సేవలను పునరుద్ధరించలేదన్న విషయాన్ని అధికారులు మంత్రి వర్గం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి, లోతుగా పరిశీలించి, చర్చించాక ఒక నిర్ణయం తీసుకువాలని మంత్రి వర్గం యోచిస్తోంది. జగన్ తప్పుడు విధానాల్లో పరిపాలన సాగించారని దానికి ఇదో నిదర్శనమని పలువురు మంత్రులు అన్నారు.
ఫస్ట్ గ్యాస్ సిలిండర్ పథకం అమలు : సూపర్‌సిక్స్‌లో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీల్లో ముందు దేన్ని అమలు చేయాలన్న అంశంపైన మంత్రివర్గంలో చర్చించారు. ఉచిత వంటగ్యాస్ పథకం, ఉచిత బస్సు సౌకర్యం రెండింట్లో ఏది ముందు అమలు చేయాలన్న అంశం చర్చకు వచ్చినప్పుడు మెజారిటీగా ఉచిక వంట గ్యాస్ పథకానికే మొగ్గు చూపారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగ ఇచ్చే పథకాన్ని వచ్చే దీపావళి నుంచే అమలు చేయాలని, నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండరు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం తర్వాత తల్లికి వందనం అనే స్కీమ్, ఆ తర్వాత ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని దశలవారీగా అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తర్వాత అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయడమే కాకుండా, ఒక సంవత్సరం మొత్తానికి ఎగ్గొట్టిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే తల్లికి వందనం అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారని క్యాబినెట్ మండిపడింది.
వరద బాధితులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు చేసిన కృషికి మంత్రులంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందలు తెలిపారు. రేయింబవళ్లు కష్టపని వరద బాధితులను ఆదుకున్నారంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుతో కరచాలనం చేసి అభినందించారు. మంత్రులు, అధికారులు సమష్టి కృషి వల్లే బాధితులకు అండగా నిలవగలిగామని సీఎం చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపింది.
రాజాధాని అమరావతిరి మరిన్ని ప్రఖ్యాత విద్యా సంస్థలను రప్పించేందుకు కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిలో క్యాంపస్ ఏర్పాటుకు బిట్స్ సుముఖంగా ఉందని, నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. రాజాధానికో 10 ప్రఖ్యాత విద్యా సంస్థలు ఏర్పాటైతే సుమారు లక్ష మంది విద్యార్థులు అక్కడికి వస్తారని. దాంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశముందని ఆయన వివరించారు.
ఇండస్ట్రీయల్ టెక్నాలజీకి 100ఎకరాలు : రాజాధానిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా కల్పించేందుకు ఎన్వోసీ జారీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్రిమెంట్ ప్రకారం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఇవ్వాల్సిన మరో 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పురపాలక శాఖ మంత్రి నారాయణకు సూచించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అమరావతిలో ఇండస్ట్రియల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు 100 ఎకరాల భూమిని కేటాయించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
లిక్కర్ పాలసీపై చర్చ : న్యూ లిక్కర్ పాలసీపై మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ఇక్కడ మద్యం ధరలు పొరుగు రాష్ట్రాల కంటే సమానంగా ఉంటేనే అక్రమ రవాణాను నివారించగలమని మంత్రివర్గం అభిప్రాయపడింది. దానిలో భాగంగానే ధరలు తగ్గిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 12ఎలైట్ మద్యం షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తిరుపతిలో ఎలైట్ షాపు ఏర్పాటుకు అనుమతి ఇవ్వారని అలాగే ఎలైట్ షాప్‌లు ఉన్న ప్రాంతంలో వాక్ ఇన్ స్టోర్లకు అనుమతి ఇవ్వారాదని నిర్ణయించింది.
భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించే విషయంలో అత్యంత పారదర్శకంగా ఉండాలని, నష్టపోయింది కౌలు రైతులు అయితే పరిహారం వారికే అందేలా చూడాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పరిహారం చెల్లింపు ఒకటి రెండు రోజులు ఆలస్యమయినా పర్వాలేదన్న ఆయన పరిహారం మాత్రం బాధితులకే అందాలి అన్నారు. అవసరమైతే దీని కోసం ఒక కమిటీని నియమించాలని సూచించారు. అదే సమయంలో భూ యమజమానుల్లో అభద్రతాభావం కలగకుండా చర్యలు తీసుకావాలని మంత్రి వర్గంలో నిర్ణయించారు.
నిధుల కోసం దిల్లీకి చంద్రబాబు : బాధితులకు వరద సాయం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించేందుకు త్వరలో దిల్లీకి వెళ్లనున్నట్లు చంద్రబాబు తెలిపారు. మాజీ సైనికుల సంక్షేమ కార్పొరేషన్‌కు రూ.3కోట్లు నిధులు కేటాయించాలి అధికారులు ప్రతిపాదించగా, ప్రాణాలు పణంగా పెట్టి దేశం కోసం పోరాడే సైనికులకు ఎంత చేసినా తక్కువేనని రూ.10కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.