ETV Bharat / state

ఈ నెల 21నుంచి అసెంబ్లీ సమావేశాలు- స్పీకర్​గా అయ్యన్న పాత్రుడు - Assembly Session Starts From June21 - ASSEMBLY SESSION STARTS FROM JUNE21

AP Assembly Session Starts From June21 :ఏపీలో శాసనసభ సమావేశాలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణస్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరుగుతుందని సభ వర్గాలు వెల్లడించాయి.

ap_assembly_session_starts_from_june21
ap_assembly_session_starts_from_june21 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 2:56 PM IST

AP Assembly Session Starts From June21 :అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 21, 22వ తేదీల్లో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల్లో శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంతోపాటు సభాపతి ఎన్నిక పూర్తికానున్నాయి. తొలుత ఈ నెల 24న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నెల 21నే చేపట్టాలని తాజాగా నిర్ణయించింది. స్పీకర్ గా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పేరు దాదాపు ఖరారు కాగా, ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్ గా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.