Anantapur Election Results 2024 : అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. అనంతపురం అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ వైఎస్సార్సీపీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డిపై విస్పష్ట ఆధిక్యంతో విజయంవైపు దూసుకెళ్లారు. ధర్మవరం వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌పై విజయం సాధించారు. గుంతకల్లులో టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డిపై ఆధిక్యాన్ని సాధించారు. హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ వైఎస్సార్సీపీ అభ్యర్థి దీపికపై స్పష్టమైన మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రత్యర్థి తలారి రంగయ్యపై స్పష్టమైన అధిక్యంతో విజయం సాధించారు. మడకశిరలో తెలుగుదేశం అభ్యర్థి ఎం.ఎస్.రాజు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరలక్కప్పపై విజయం సాధించారు. పెనుకొండలో తెలుగుదేశం అభ్యర్థి సవిత వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉష శ్రీచరణ్‌పై ఆధిక్యాన్ని సాధించారు.
ఓటమి దిశగా వైఎస్సార్సీపీ - మంత్రులూ ఇంటి బాటే - defeat of YsrCP ministers 2024 ap
YSRCP Defeat in Anantapur District : పుట్టపర్తిలో తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిపై విజయం పొందారు. రాయదుర్గంలో తెలుగుదేశం అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు వైఎస్సార్సీపీ అభ్యర్థి గోవిందరెడ్డిపై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై గెలుపొందారు. శింగనమలలో తెలుగుదేశం అభ్యర్థి బండారు శ్రావణి వైస్సార్సీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై గెలుపొందారు. తాడిపత్రిలో తెలుగుదేశం అభ్యర్థి జె.పి. అశ్మిత్ రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై విజయం సాధించారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ వైఎస్సార్సీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ వైఎస్సార్సీపీ అభ్యర్థి మక్బూల్‌పై గెలుపొందారు.