ETV Bharat / state

పంద్రాగస్టు నుంచి అన్న క్యాంటీన్‌ - రూ.5కే భోజనం :  మంత్రి నారాయణ - Anna Canteen From 15th August - ANNA CANTEEN FROM 15TH AUGUST

Anna Canteens Reopen from August 15th: రాష్ట్రంలో అన్న క్యాంటీన్​లను ఆగస్టు 15 తేదీన ప్రారంభిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. గతంలో మాదిరిగా 5 రూపాయల చొప్పున భోజనం, టిఫిన్​లను అందిస్తామని స్పష్టం చేశారు. పిడుగురాళ్లలో నీరు కలుషితమై 100 మందికి డయేరియా సోకిందన్న ఆయన ప్రతి ఒక్కరు తాగునీటిను కాచుకొని తాగాలని సూచించారు.

Anna Canteens Reopen from August 15th
Anna Canteens Reopen from August 15th (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 7:55 PM IST

Anna Canteens Reopen from August 15th : రాష్ట్రంలో అన్న క్యాంటీన్​లను ఆగస్టు 15 తేదీన ప్రారంభిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 2.25 లక్షల మంది అన్నార్థుల ఆకలి తీర్చేలా వీటిని మొదలు పెడుతున్నామన్నారు. మొత్తం 203 క్యాంటీన్​లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

ఎక్కడా ధర పెంచడం లేదు : గత ప్రభుత్వ హయాంలో అన్నింటినీ గోదాములు, సచివాలయాలుగా, బ్లీచింగ్ నిల్వ కేంద్రాలుగా వాడుకున్నారని నారాయణ విమర్శించారు. అన్న క్యాంటీన్​ల నిర్వహణకు టెండర్​లను పిలిచామన్నారు. గతంలో అక్షయపాత్ర ఫౌండేషన్ రుచికరమైన భోజనం అందించిందని గుర్తు చేశారు. గతంలో మాదిరిగా అదే 5 రూపాయలకు చొభోజనం, టిఫిన్లు అందిస్తామని స్పష్టం చేశారు. ఎక్కడా ధర పెంచడం లేదని, అన్ని అన్న క్యాంటీన్లు ఒకే మోడల్‌లా ఉంటాయని స్పష్టం చేశారు.

విశాఖలో అన్న క్యాంటీన్​ను అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై నేతల బైఠాయింపు

100 మందికి డయేరియా సోకింది : రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా వ్యాప్తి చెందుతోందని, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నీరు కలుషితమై 100 మందికి డయేరియా సోకిందని నారాయణ తెలిపారు. పైపులు మరమ్మతులు చేయవం వల్లే కొన్ని ఇబ్బందులు వచ్చాయని, మురికి కాల్వల నిర్వహణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు.

నిధులన్నీ గత ప్రభుత్వం ఖాళీ చేసింది : సిల్ట్‌ తీసేందుకు 106 పురపాలక సంఘాలకు రూ.50 కోట్లు విడుదల చేసినట్లు నారాయణ చెప్పారు. సిల్ట్‌ తీయడంతో పాటు, 24 గంటల్లో దానిని తరలించాలని తెలిపారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. మున్సిపల్ శాఖ నిధులన్నీ గత ప్రభుత్వం ఖాళీ చేసిందని ఆరోపించారు. అమృత్‌ పథకానికి షేర్ ఇవ్వనందు వల్ల కేంద్రం నుంచి నిధులు రాలేదని అన్నారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరు తాగునీటిను కాచుకొని తాగాలని ఆయన సూచించారు. చెత్త పన్ను అంశంపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

'కేసులకు భయపడం.. జగన్​ నేరచరిత్రపై పోరాటం'

సీఎం చంద్రబాబు పెద్దమనసు - ఇచ్చిన మాటపై నిలబడి - ఓ పేదదంపతుల కుటుంబానికి ఇళ్లు! - Chandrababu Kept His Promise

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.