Andhra University VC Prasada Reddy and Registrar Stephenson Resigned: ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్‌సన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ప్రొ. కిశోర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. గత ఐదేళ్లలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి యూనివర్సిటీని భ్రష్టు పట్టించారంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, వీసీ ఛాంబర్‌ను, వర్సిటీని వైఎస్సార్సీపీ కార్యాలయంగా మార్చేశారని, వైఎస్సార్సీపీ పెద్దల కనుసన్నల్లోనే పనిచేశారనే అభియోగాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ గెలుపు కోసం పరిశోధకులను ఉపయోగించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రావడంతో వీసీ తన పదవికి రాజీనామా చేశారు.
వీసీఫై పరిశోధకులు, పూర్వ విద్యార్థుల నిరస: అంతకుముందు వీసీఫై పరిశోధకులు, పూర్వ విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ నిరసనలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ పాల్గొన్నారు. పీవీజీడీ ప్రసాదరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని అలాగే తన పాలనలో జరిగిన అవినీతిపై జ్యుడీషల్ విచారణ వేయాలని డాక్టర్ దాసరి శ్యామ్ అన్నారు. శుక్రవారం ఉదయం దాసరి శేషు యూనివర్సిటీలో టీఎన్టీటీయూసీ నాయకులు, ఎస్సీ- ఎస్టీ, బీసీ సంఘాల నేతలతో కలిసి యూనివర్సిటీని సందర్శించారు. ప్రసాదరెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కాకుండా వైఎస్సార్సీపీ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారని ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Sexual Harassment Case in AU: విశాఖ ఏయూలో లైంగిక వేధింపుల కలకలం.. సమగ్ర విచారణపై కమిటీ..
యూనివర్సిటీకి సంబంధం లేని ఒక బయట వ్యక్తిని తీసుకువచ్చి యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమించి తన అక్రమాలను కొనసాగించారని మండిపడ్డారు. అలాగే రిటైర్డ్ అయిన మాజీ రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్‌ను ఓఎస్డీగా నియమించి తన అక్రమాల దందాను కొనసాగించారని తెలిపారు. నోటిఫికేషన్ లేకుండా పోస్టుల భర్తీ చేయడంతో పాటు రీవాల్యుయేషన్ పెట్టి డబ్బులు ఇచ్చిన వాళ్ల అందరికీ పాస్ మార్కులు వేయడంతో పాటు బీహెచ్డీ అడ్మిషన్స్లో అనేక అవకతవకలు పాల్పడ్డారని అన్నారు. రిటైర్డ్ అయిన నాన్ టీచింగ్ ఉద్యోగస్తులను ఇంకా పదవుల్లో కొనసాగిస్తూ లక్షల రూపాయలు జీతాలను ధారాధాత్తంగా ఇస్తున్నారని తెలిపారు. వాటితో పాటుగా రోసా నిధులను కూడా దారి మళ్లించారని అన్నారు. విశ్వవిద్యాలయాన్ని విద్యా కేంద్రంగా కాక వైసీపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చారని మండిపడ్డారు.
HC On Trees Cutting: ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చెట్లు కొట్టివేతపై హైకోర్టు ఆగ్రహం..