ETV Bharat / state

మద్యం దుకాణాల టెండర్ల అప్డేట్​ - 20 వేలు దాటిన దరఖాస్తులు - మరో 2 రోజులే గడువు - AP WINE TENDER UPDATES 2024

ఏపీలో మద్యం దుకాణాల కోసం 20 వేల వరకు అందిన దరఖాస్తులు - బుధవారం వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు

AP WINE TENDER NEWS TODAY
AP Wine Shop Tenders (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2024, 10:41 AM IST

AP Wine Shop Tenders : ఆంధ్రప్రదేశ్​లో మద్యం దుకాణాల కోసం సోమవారం రాత్రి 9 గంటల వరకూ 20,310 దరఖాస్తులు అందాయి. వీటిలో సోమవారం నాడే 12,036 అర్జీలు వచ్చాయి. మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఏడు రోజుల వ్యవధిలో ఈ దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో దుకాణానికి ఆరు చొప్పున అర్జీలు పడ్డాయి. నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో సర్కార్​కి రూ.406.20 కోట్ల ఆదాయం సమకూరింది. బుధవారం వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉంది. దీంతో ఇవాళ, రేపు(బుధవారం) వేల సంఖ్యలో అర్జీలు వస్తాయని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు చేసుకునేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారని ఎక్సైజ్‌ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు విజయనగరం జిల్లాలో 153 దుకాణాలు నోటిఫై చేశారు. వాటికి ఏపీలోనే అత్యధికంగా 1,689 అర్జీలు పడ్డాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 113 దుకాణాలకు 1,519 దరఖాస్తులు వచ్చాయి. ఏలూరులో 144 దుకాణాలకు గాను 1,488 అర్జీలు అందాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 175 దుకాణాలకు 1,127, శ్రీకాకుళంలో 158 దుకాణాలకు 1,003 దరఖాస్తులు అందాయి. ఈ జిల్లాల్లో ఎక్కువగా పోటీ ఉంది.

వాణిజ్య బ్యాంకులోనైనా డీడీ తీయొచ్చు : మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆఫ్‌లైన్‌ విధానంలో నాన్‌ రీఫండ్‌బుల్‌ రుసుములు చెల్లించేందుకు ఏపీ సర్కార్ పలు వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా రూ.2 లక్షల దరఖాస్తు రుసుముకు సంబంధించి దేశంలోని ఏ వాణిజ్య బ్యాంకులో తీసిన డిమాండ్‌ డ్రాఫ్ట్‌ (డీడీ)నైనా అంగీకరిస్తామని తెలిపింది. గ్రామీణ బ్యాంకుల్లో డీడీలు తీస్తే మాత్రం అవి రాష్ట్ర పరిధిలోని బ్యాంకులే అయి ఉండాలని స్పష్టం చేసింది.

సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి కూడా చలానా తీసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ చలానాలు, డీడీల ఒరిజినల్‌ను సంబంధిత కార్యాలయంలో సమర్పించాలని సూచించింది. పూర్తిగా ఆఫ్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఎక్సైజ్‌ స్టేషన్‌లలో సంప్రదించాలని తెలిపింది. అక్కడ చలానా లేదా డీడీ సమర్పించాలని వివరించింది. ఈ మేరకు ఇటీవల తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో స్వల్ప సవరణలు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం నాడు ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా జారీ చేశారు.

'మాకు షేర్ ఇవ్వండి - లేదా పోటీ నుంచి తప్పుకోండి' - Wine Shop Tenders 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.