ETV Bharat / state

మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం - మరికొన్ని కీలక నిర్ణయాలు ఇవే! - AP CABINET APPROVES MEGA DSC - AP CABINET APPROVES MEGA DSC

AP Cabinet Approves Mega DSC : ఏపీ రాష్ట్రమంత్రివర్గ తొలి సమావేశం ప్రారంభమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై ఈ సమావేశంలో రెండు ప్రతిపాదనలు తెచ్చారు.

AP Cabinet Approves Mega DSC
AP Cabinet Approves Mega DSC (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 11:47 AM IST

Updated : Jun 24, 2024, 1:02 PM IST

AP Cabinet Approves Mega DSC : ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై చర్చిస్తున్నారు.

మరోవైపు ఏపీలో మెగా డీఎస్సీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చర్చల్లో భాగంగా కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై 2 ప్రతిపాదనలు తీసుకువచ్చారు. డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్​ను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు. జులై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదించింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్‌ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్‌ రూ.4 వేల పెంపు సహా పెండింగ్ బకాయిలు కలిపి జులై 1న ఇంటివద్దే రూ.7 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదించింది.

బిగ్ బ్రేకింగ్ : 'మెగా డీఎస్సీ'పై ఏపీ ముఖ్యమంత్రి తొలి సంతకం.. ఎన్ని వేల టీచర్​ పోస్టులంటే? - Chandrababu took charge as CM

AP Cabinet Meeting 2024 : మరోవైపు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నడిచిన ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున నెలకు రెండు పర్యాయాలు మంత్రివర్గ సమావేశం నిర్వహించే సాంప్రదాయాన్ని తిరిగి పునరిద్దరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సంతకం చేసిన 5 దస్త్రాలతో పాటు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు జరగాల్సి ఉన్న అసెంబ్లీ సమావేశాలు, వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల వంటి కీలక అంశాలపై మంత్రివర్గంలో కీలకచర్చ జరుగుతోంది. జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

పెన్షన్ల పెంపు అంశంపై మంత్రివర్గం చర్చించింది. వచ్చే జులై 1 తేదీ నుంచి 3 వేల రూపాయల నుంచి 4 వేలకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలు 3 వేలను ప్రభుత్వం చెల్లించనుంది. వచ్చే నెలలో 65 లక్షల మంది పెన్షన్ లబ్దిదారులు ఒకేసారి 7 వేలు అందుకోనున్నారు. వీటితో పాటు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా ప్రకటించిన సూపర్ - 6 పథకాల అమలు, అందుకు అణుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

AP Cabinet Decisions 2024 : వీటితో పాటు సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, ఏపీ అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో అస్సైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లపైనా వివరాలు కేబినేట్‌ ముందుకు వచ్చాయి. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేస్తున్నారు. వివిధ కార్పొరేషన్ల పునరుద్దరణ వాటికి నిధుల సమీకరణ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్థి, ఎన్నికల్లో ప్రకటించిన బీసీలకు రక్షణ చట్టం హామీ అమలు, వివిధ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, నూతన విద్యవిధానం, ఉచిత ఇసుక వంటి కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది.

రాష్ట్రంలో డీఎస్సీకి భారీగా దరఖాస్తులు - ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే? - Telangana DSc Exam 2024

రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల - పోస్టుల వివరాలు ఇవే

Last Updated : Jun 24, 2024, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.