ETV Bharat / state

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం - ఫస్ట్ చంద్రబాబు, తర్వాత ఎవరంటే? - andhra pradesh assembly sessions

AP Assembly Sessions 2024 : ఏపీ అసెంబ్లీలో శుక్రవారం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ప్రమాణం చేస్తారని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మహిళా సభ్యులు, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. సాధారణ సభ్యులుగానే జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.

MINISTER PAYYAVULA KESHAV
Minister Payyavula on AP Assembly Sessions (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 6:51 PM IST

Updated : Jun 20, 2024, 8:08 PM IST

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం - ఫస్ట్ చంద్రబాబు, తరువాత ఎవరంటే? (ETV BHARAT)

AP MLA Swearing Ceremony 2024 : ఏపీలో శుక్రవారం (జూన్ 21వ తేదీ) అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ప్రమాణస్వీకారం చేస్తారని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. తరువాత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మహిళా సభ్యులు అనంతరం ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. సాధారణ సభ్యులుగానే జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. సభ్యుల సీటింగ్ ఆంగ్ల అక్షరాల ప్రాతిపదికన ఉంటుందని తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులందరూ ఒకే చోటే కూర్చుంటారని, ఎక్కడ అనేది సీట్ల కేటాయింపులోనే జరుగుతుందని తెలిపారు.

సందర్శకులకు ప్రవేశం లేదు.. శుక్రవారం, శనివారం జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు సందర్శకులకు ప్రవేశం లేదని పయ్యావుల కేశవ్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కోసం కుటుంబసభ్యులతో సహా ఎవరికి విజిటింగ్ పాస్​లు జారీ చేయడం లేదన్నారు. అసెంబ్లీలో స్థలాభావం కారణంగా విజిటింగ్ పాస్​లు రద్దు చేసినట్టు స్పష్టం చేశారు. ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, అనంతరం డిప్యూటీ సీఎంల ప్రమాణం చేయనున్నారు.

చెమ్మగిల్లిన చంద్రబాబు కళ్లు - మట్టిని ముద్దాడి అమరావతికి సాష్టాంగ నమస్కారం - AP CM Chandrababu Amaravati Tour

ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం: తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేశారు. గోరంట్లతో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. కాగా 21, 22 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, పవన్, జగన్ సహా ఇతర సభ్యులతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ప్రస్తుతం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రోటెం స్పీకర్​గా ప్రమాణ స్వీకారం చేయడంపై మంత్రులు, శాసనసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రోటెం స్పీకర్​గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. ప్రోటెం స్పీకర్​గా తనతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్​కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, టీజే భరత్, సవిత, ఎం.రాంప్రసాద్ రెడ్డి, శాసనసభ్యులు భూమా అఖిల ప్రియ, పి. అదితి గజపతి రాజు, బొండా ఉమా మహేశ్వరరావు, బోడె ప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాసులు, సుందరపు విజయ్ కుమార్, ఉన్నతాధికారులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సచివాలయంలో చంద్రబాబుతో పవన్​ కల్యాణ్​ భేటీ - ఘనస్వాగతం పలికిన అమరావతి రైతులు - Pawan visited ap Secretariat

'ఏపీకి శాపంగా జగన్ - రూ.446 కోట్లు పెట్టినా పోలవరం బాగయ్యే పరిస్థితి లేదు - మరో నాలుగేళ్లు వేచి చూడాల్సిందే' - CHANDRABABU ON POLAVARAM PROJECT

Last Updated : Jun 20, 2024, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.