Andhra Pradesh Exit Poll 2024 : దేశం మొత్తం చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపే. ఎందుకంటే ఈసారి ఇక్కడి సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు నువ్వానేనా అన్నట్లు సాగాయి. అందుకే కౌంటింగ్‌కు ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్‌పై అందరూ ఆసక్తి ఎదురు చూశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌ను పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు విడుదల చేశాయి. అన్ని సర్వే సంస్థలు కూటమే గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. ఏపీలో కూటమిదే పట్టమని కేకే సర్వే, పీపుల్స్ పల్స్, రైజ్ ఎగ్జిట్‌పోల్స్ చెప్పుతున్నాయి. అలాగే చాణక్య స్ట్రాటజీస్, పయనీర్, ఇండియా టీవీ, జనగళం, సీఎన్ఎక్స్, ఇండియా న్యూస్-డీ డైనమిక్స్, ఏబీపీ సీ ఓటరు సర్వే తేల్చి చెప్పాయి. ఏపీ లోక్‌సభ సీట్లలోనూ కూటమిదే ఆధిపత్యమని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. ఆరా సర్వే సంస్థ మాత్రం టీడీపీకి 12 లోక్‌సభ సీట్లు, వైఎస్సాఆర్సీపీకి 13 సీట్లను ఇచ్చింది.
ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు :
చాణక్య స్ట్రేటజీస్ :
టీడీపీ+ : 114-125
వైఎస్సాఆర్సీపీ : 39-49
ఇతరులు : 0-1
రైజ్ :
టీడీపీ+ : 113-122
వైఎస్సాఆర్సీపీ : 48-60
ఇతరులు : 0-1
పయనీర్ :
టీడీపీ+ : 144
వైఎస్సాఆర్సీపీ : 31
ఇతరులు : 0
పీపుల్స్ పల్స్ :
టీడీపీ + : 95-110
వైఎస్సాఆర్సీపీ : 45-60
జనసేన : 14-20
బీజేపీ : 2-5
ఇతరులు : 0
జనగళం :
టీడీపీ : 104-118
వైఎస్సాఆర్సీపీ : 44-57
ఇతరులు : 0
ఏపీ పార్లమెంటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు :
పీపుల్ పల్స్ :
టీడీపీ : 13-15
జనసేన : 2
బీజేపీ : 2-4
వైఎస్సాఆర్సీపీ : 3-5
ఇతరులు : 0
కేకే సర్వే :
టీడీపీ : 17
జనసేన : 2
బీజేపీ : 6
వైఎస్సాఆర్సీపీ : 0
ఇతరులు : 0
రైజ్ :
టీడీపీ : 17-20
వైఎస్సాఆర్సీపీ : 7-10
సీఎన్ఎక్స్ :
టీడీపీ : 13-15
వైఎస్సాఆర్సీపీ : 3-5
జనసేన : 2
బీజేపీ :4-6
ఇండియా న్యూస్ -డీ డైనమిక్స్
టీడీపీ : 18
వైఎస్సాఆర్సీపీ : 7
ఏబీపీ సీ ఓటర్
టీడీపీ : 21-25
వైఎస్సాఆర్సీపీ : 0-4
న్యూస్ 18 :
టీడీపీ : 19-22
వైఎస్సాఆర్సీపీ : 5-8
ఇతరులు : 0
ఇండియా టీవీ :
టీడీపీ 13-15
వైసీపీ : 3-5
జనసేన : 2
బీజేపీ : 4-6
చాణక్య స్ట్రేటజీస్ :
టీడీపీ 17-18
వైసీపీ : 6-7
పయనీర్ :
టీడీపీ : 20
వైసీపీ : 5
ఆరా :
టీడీపీ : 12
వైఎస్సాఆర్సీపీ : 13