ETV Bharat / state

పాముకాటును గుర్తించని తల్లిదండ్రులు - బాలుడి ప్రాణాలు కాపాడిన కిమ్స్ సవీర వైద్యులు - Kims Doctors Saved Snake Bite Boy - KIMS DOCTORS SAVED SNAKE BITE BOY

Kims Doctors Saved Snake Bite Boy Life : పాము అంటేనే భయం. అలాంటిది అది కరిస్తే? భయపడి, ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం. కానీ కరిచింది పాము అన్న సంగతి కూడా తెలియకుంటే, దానికి ఏ విధంగా చికిత్స పొందుతాం. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే అనంత‌పురంలో జ‌రిగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ బాలుడుకు అత్యవసరం చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు కిమ్స్ సవీర వైద్యులు.

Snake Bite incident in Ananthapuram
Kims Doctors Saved Snake Bite Boy Life (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 7:21 PM IST

Kims Doctors Saved Snake Bite Boy Life : సాధార‌ణంగా పాము కాటు వేస్తే రెండు గాట్లు ప‌డ‌తాయి. అలాగే కాటు ప‌డిన ప్రాంతంలో వాపు, నొప్పి కూడా ఉంటాయి. కానీ క‌ట్ల‌పాము కాటేస్తే మాత్రం ఇవేవీ క‌నిపించ‌వు. కానీ, ఆ త‌ర్వాత కొంత‌సేప‌టికి వాంతులు, క‌డుపునొప్పి, గొంతు నొప్పి లాంటి సాధార‌ణ ల‌క్ష‌ణాలుంటాయి. ఇంకా ఎక్కువ స‌మ‌యం అయితే అప్పుడు న‌రాల బ‌ల‌హీన‌త‌, ఊపిరి అంద‌క‌పోవ‌డం లాంటివి క‌నిపిస్తాయి.

అందుకే వీటిని పాము కాటుగా త‌ల్లిదండ్రులే కాదు, సాధార‌ణ వైద్యులు కూడా గుర్తించ‌లేరు. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే అనంత‌పురంలో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను పిల్ల‌ల వైద్య నిపుణుడు, డాక్ట‌ర్ ఎ. మ‌హేశ్​ తెలిపారు. 12 ఏళ్ల బాలుడు ఊపిరి స‌రిగా అంద‌ని ప‌రిస్థితిలో అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి తీసుకొచ్చారన్నారు. అప్ప‌టికి అత‌డి ఆక్సిజ‌న్ శాచ్యురేష‌న్ కేవ‌లం 66% మాత్ర‌మే ఉందని, చెస్ట్ ఎక్స్‌రే తీసి చూస్తే, న్యుమోనియా ల‌క్ష‌ణాల లాంటివి కొన్ని క‌నిపించాయన్నారు. కానీ, ఒక రోజు ముందువ‌ర‌కు బాబుకు ఎలాంటి ఇబ్బందీ లేదని గమనించారు.

వెంటిలేట‌ర్ అమ‌ర్చి, అత్యవసర చికిత్స మొద‌లు : అంటే న్యుమోనియాలో క‌నిపించే జ్వ‌రం, ద‌గ్గు, జలుబు లాంటివి ఒక్క‌టి కూడా లేవు. కానీ ఆక్సిజ‌న్ శాచ్యురేష‌న్ బాగా త‌క్కువ‌గా ఉండ‌టంతో ముందుగా వెంటిలేట‌ర్ అమ‌ర్చి, చికిత్స మొద‌లుపెట్టామన్నారు. ఆ త‌ర్వాత అస‌లు ఏం జ‌రిగింద‌ని ఆరా తీశామని డాక్టర్​ మహేశ్​ తెలిపారు. ముందుగా అర్ధ‌రాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో బాబుకు తీవ్రంగా క‌డుపునొప్పి వ‌చ్చిందని, ఆ త‌ర్వాత వాంతులు కావ‌డం మొద‌లుపెట్టాయని తెలుసుకున్నారు.

తెల్ల‌వారు జామున గంట‌ల స‌మ‌యంలో గొంతు కూడా నొప్పి అనిపించ‌డంతో స్థానికంగా ఉన్న ఒక ఆస్ప‌త్రికి తీసుకెళ్లారని, ల‌క్ష‌ణాలు చూసిన అక్క‌డి వైద్యులు పేగుల్లో ఏదో స‌మ‌స్య అయి ఉంటుంద‌ని భావించి, అందుకు సంబంధించిన మందులు ఇచ్చారు. త‌ర్వాత కొన్ని గంట‌ల పాటు బాగానే ఉన్న బాబుకు, ఆ త‌ర్వాత ఊపిరి అంద‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దాంతో వెంట‌నే కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ చూస్తే త‌ప్ప‌నిస‌రిగా బాబును పాము కాటేసి ఉంటుంద‌న్న నిర్ధార‌ణ‌కు వ‌చ్చినట్లు మహేశ్​ వివరించారు.

సాధార‌ణంగా పాము కాటు వేస్తే నోటివెంట నుర‌గ‌లు రావ‌డం, న‌రాలు చ‌చ్చుబ‌డిపోవ‌డం లాంటి కొన్ని ల‌క్ష‌ణాలు ఉంటాయి. కానీ, కొన్నిర‌కాల పాములు కాటు వేస్తే మాత్రం ఇలా ఉండ‌క‌పోగా, వేరే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయని చెప్పుకొచ్చారు. పాము కాటు అని నిర్ధార‌ణ కావ‌డంతో బాబుకు ముందుగా పాము విషానికి విరుగుడు అయిన ఏఎస్‌వీ (యాంటీ స్నేక్ వీనం) ఇంజెక్ష‌న్లు ఇచ్చి, దాంతో పాటు కాల్షియం కూడా ఇవ్వ‌డంతో రెండు రోజుల త‌ర్వాత బాబు పూర్తిగా కోలుకున్నాడన్నారు. అత‌డి ఆక్సిజ‌న్ శాచ్యురేష‌న్ కూడా సాధార‌ణ స్థాయికి రావ‌డంతో వెంటిలేట‌ర్ తొల‌గించి, రెండు రోజుల్లోనే డిశ్చార్జి చేశామన్నారు.

కాటేసిన పాముతో ఆసుపత్రికి - బాధితుడి చెప్పిన కారణం విని వైద్యులు షాక్!

పాముకాటుకు విరుగుడు- ల్యాబ్​లో యాంటీబాడీల అభివృద్ధి- బెంగళూరు శాస్త్రవేత్తల ఘనత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.