Ambulance Stalled Due To Heavy Rain : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం ఓ రోగికి ప్రాణసంకటంగా మారింది. సాయంత్రం ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో మలక్‌పేట రైల్వే బ్రిడ్జి వద్ద భారీ ఎత్తున వరద నీరు చేరింది. ఇదే సమయంలో కోదాడ నుంచి నిమ్స్ ఆసుపత్రికి ఓ రోగిని తీసుకుని అంబులెన్స్ వస్తోంది. ఈ క్రమంలో మలక్‌పేట రైల్వే బ్రిడ్జి గుండా వస్తుండగా వరదనీరు ఇంజన్‌లోకి చేరడంతో అంబులెన్స్ నీటిలోనే నిలిచిపోయింది. ఎంత ప్రయత్నించినా అంబులెన్స్ ముందుకు కదలకుండా వరదనీటిలోనే ఉండిపోయింది. అంబులెన్స్ గంటపాటు వరదనీటిలోనే ఉండడంతో అందులో ఉన్న రోగి వేచిచూడాల్సి వచ్చింది. సహయం కోసం 100 డయల్ చేసినా సంబంధిత అధికారులు స్పందించలేదని రోగి కుటుంబ సభ్యులు అవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లో ఉన్న రోగికి ఆక్సిజన్ సమస్య ఏర్పడడంతో వెంటనే వేరే ఆటోలో నిమ్స్ ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు.
Ambulance Siren In Hyderabad : మిర్చీ బజ్జీల కోసం అంబులెన్స్ సైరన్.. చివరికి ఏమైందంటే..
Ambulance accident Hyderabad : అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న అంబులెన్స్.. డ్రైవర్ మృతి