ETV Bharat / state

నిరుపేద బాలికకు పాము కాటు - ఆధార్‌ లేదని ఆసుపత్రికి తీసుకెళ్లని 108 సిబ్బంది - తర్వాత? - GIRL DIES OF SNAKE BITE VIKARABAD

పాము కాటుకు గురైన నిరుపేద బాలిక - ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసుపత్రికి తరలించేందుకు నిరాకరించిన అంబులెన్స్‌ సిబ్బంది - అక్కడికక్కడే బాలిక మృతి

Girl Dies of Snake bite in Vikarabad
Girl Dies of Snake bite in Vikarabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Girl Dies of Snake bite in Vikarabad : రాత్రి సమయంలో పాము కాటుకు గురై ఆపదలో ఉన్న బాలికకు ఆధార్‌ కార్డు లేదని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ సిబ్బంది నిరాకరించారు. ఫలితంగా ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన ఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, వికారాబాద్‌ జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం నందారంలో సంచార కుటుంబానికి చెందిన బుడగ జంగం సంగీత, దివ్యాంగురాలైన ఆమె తల్లి రంగమ్మలు భిక్షాటన, కూలీ పనులు చేస్తూ గ్రామంలోని ఓ పాత భవనంలో నివాసం ఉంటున్నారు.

శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భోజనం చేసి పక్కనే ఉన్న గోడ మీద సంగీత చేయిని పెట్టింది. అక్కడే ఉన్న పాము ఆమెను కాటేసింది. ఆమె పెద్దగా అరిచి తల్లికి చెప్పడంతో చుట్టుపక్కల వారి సాయంతో 108 సమాచారమిచ్చారు. అంబులెన్స్ 10.30 గంటలకు వచ్చింది. తల్లి వెంట రాగా, సంగీతను కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తాండూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా పరిస్థితి కుదుటపడలేదు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో రంగమ్మ స్థానికుల సహాయంతో మరో 108 అంబులెన్సుకు సమాచారమిచ్చారు. దాదాపు గంటసేపు తర్వాత అంబులెన్స్ వచ్చింది.

మీ ఏరియాలో పాముకాట్లు అధికమా? - నివారణ కోసం కేంద్రం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది

అంబులెన్స్‌లోకి వెళ్లాలి అంటే డబ్బులు ఇస్తా : హైదరాబాద్‌ ప్రభుత్వాసుపత్రుల్లో ఆధార్‌ కార్డు లేనిదే చేర్చుకోరని 108 సిబ్బంది ఆమెకు చెప్పారు. పాము కాటుకు గురైందని తెలియగానే ఆత్రుతతో వచ్చినందున కార్డు తీసుకు రాలేదని చెప్పగా, అది తెస్తే అంబులెన్సులో తీసుకెళ్తామంటూ సిబ్బంది కొద్దిసేపు వేచి చూశారు. స్థానికులు నచ్చజెప్పినా సిబ్బంది అసలు పట్టించుకోలేదు. ఇలా ఆలస్యం చేయడంతో ఇంతలో సంగీత పరిస్థితి విషమించి అక్కడే ప్రాణాలు వదిలింది. తన బిడ్డ మరణానికి అంబులెన్సు సిబ్బందే కారణమంటూ రంగమ్మ బోరున విలపించింది.

రోడ్డు ప్రమాదంలో భర్త మరణం - 14 ఏళ్లకు దక్కిన న్యాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.