Ambedkar Jayanthi Celebrations 2024 : రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి గవర్నర్ రాధాకృష్ణన్ సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రితో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆచార్య కోదండరామ్ తదితరులు అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి అంజలి ఘటించారు.
హక్కులే సర్వస్వం.. సమన్యాయం కోసం అలుపెరగని పోరాటం
Ambedkar Jayanthi Celebrations in Telangana : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని(Ambedkar Bronze Statue) ఏర్పాటు చేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దపెల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
BR Ambedkar Jayanthi in BRS Party Office : అంబేద్కర్ జయంతి సందర్బంగా సంగారెడ్డి పాత బస్టాండు వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి మాజీమంత్రి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళలర్పించారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజలారా మేల్కొండి - వాళ్ల కుట్రలను అర్థం చేసుకోండి : కేటీఆర్ - Ambedkar Jayanthi Celebrations
కరీంనగర్‌లో మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పలువురు గులాబీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలు ఆలోచనల మేరకు గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని మాజీమంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు.
"దశాబ్దం కాలంపాటు ప్రజల ఆశీర్వాదంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అంబేడ్కర్ చెప్పిన బాటలోనే ప్రయాణం చేయడానికి బలంగా ప్రయత్నం చేశాం. స్వేచ్ఛ కంటే సమానత్వం ముఖ్యమని ఆ మహానుభావుడు చెప్పారు. దానికి అనుగుణంగానే విద్యతోనే వికాసం వస్తుంది. వికాసం వల్లనే ప్రగతి వస్తుంది. ప్రగతితోనే సమానత్వం వస్తుందనే ఆలోచనతోనే 1022 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం." -కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Ambedkar Birth Anniversary in BJP Office : నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ బీబీ పాటిల్(MP Bibi Patil), ఎమ్మెల్యే మాణిక్‌రావు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
హైదరాబాద్‌లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) పాల్గొన్నారు. పార్టీ నేతలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అంబేడ్కర్‌కు పుష్పాంజలి ఘటించారు.
ఏపీలో రాజ్యాంగ నిర్మాతకు తీరని అవమానం! జగన్‌కు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత ఉందా?
'పోటీ పరీక్షల అభ్యర్థులకు గుడ్ న్యూస్ - త్వరలోనే నియోజకవర్గానికో స్టడీ సెంటర్'