Allu Arjun in RTO Office : ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి చేశారు. గతంలో తన కారు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను రవాణా శాఖ కార్యాలయంలో అందజేశారు. ఇవాళ తన బీఎండబ్ల్యూ-ఐ7 కారుకు నంబర్ కేటాయించినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. బీ.ఎం.డబ్ల్యూ -ఐ7 సిరీస్ కారు సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్ కారుకు TG009 6664 నంబర్ కేటాయించినట్లు ఖైరతాబాద్ రవాణాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. హీరో అల్లు అర్జున్ రవాణా శాఖ కార్యాలయానికి రావడంతో అభిమానులు చూసేందుకు తరలివచ్చారు.
Pushpa-2 Movie : మరోవైపు అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సీక్వెల్‌ను వరల్డ్ వైడ్‌గా ఆగస్ట్ 15న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. కచ్చితంగా ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాలో హీరోయిన్గా రష్మిక మందాన నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల పుష్ప మూవీ మేకర్స్ సినిమా నుంచి 'పుష్ప పుష్ప' పేరిట ఫస్ట్ సింగిల్ (Song) రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా ఆరు భాషల్లో రిలీజైన ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఆరు భాషల్లో కలిపి ఈపాట 50+ మిలియన్ వ్యూస్ దాటింది. ఈ క్రమంలో ఫాస్టెస్ట్‌గా 50 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా రికార్డ్ కొట్టింది. ఇదే సమయంలో దాదాపు 15 దేశాల్లో పుష్ప పుష్ప పాట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇప్పటికే ఈ పాటపై ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లు లక్షకుపైగా రీల్స్ కూడా చేశారు. అంటే సోషల్ మీడియాలో పుష్ప హవా ఏ రేంజ్లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క పాటకే ఈరేంజ్ రెస్పాన్స్ లభిస్తే, ఫుల్ మూవీ రిలీజ్ అయ్యాక పుష్ప రాజ్ ఏ లెవల్లో రికార్డులు తిరగరాస్తాడో! చూడాలి.
బన్నీకి మాత్రమే సాధ్యమైన రికార్డులివే - అన్నింటిలోనూ నెం.1! - HAPPY BIRTHDAY ALLUARJUN
అల్లు అర్జున్ - అట్లీ మూవీలో హీరోయిన్ ఎవరంటే? - Atlee Allu Arjun Movie