ETV Bharat / state

నాన్నకు ప్రేమతో - పవన్ కల్యాణ్ జర్నీపై అకీరా వీడియో - AKIRA NANDAN SPECIAL VIDEO FOR PAWAN KALYAN - AKIRA NANDAN SPECIAL VIDEO FOR PAWAN KALYAN

Akira Nandan Video On Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయదుందుభి మోగించారు. ఆయన గెలుపుతో రాజకీయ ప్రముఖులతోపాటు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ తమ కుమారుడు అకీరా నందన్ ఎడిట్ చేసిన ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Akira Nandan Video On Pawan Kalyan
Akira Nandan Video On Pawan Kalyan (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 12:37 PM IST

Updated : Jun 7, 2024, 11:42 AM IST

Akira Nandan Video On Pawan Kalyan : 'నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను' అంటూ తన సినిమాలో చెప్పినట్లుగానే తన పార్టీ పోటీ చేసిన స్థానాల్లో వంద శాతం గెలుపు సాధించి నయా రికార్డు సృష్టించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ అంతా సంబురాలు చేసుకుంటోంది.

సోషల్ మీడియాలో అయితే వీడియోలు, రీల్స్, షాట్స్, మీమ్స్ హవా సాగుతోంది. పవన్ కల్యాణ్, జనసేనపై పోస్టులు నెట్టింట హల్ చల్ సృష్టిస్తున్నాయి. పవనిజం, పవర్ స్టార్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రసంగాల బిట్లను రీల్స్​గా చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఆ జాబితాలో పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా చేరాడు. తన తండ్రి కోసం అకీరా ఓ వీడియోను ఎడిట్ చేశాడు. అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు. ఎన్నికల ముందే అకీరా ఆ వీడియో తయారు చేశాడట. ఈ విషయాన్ని పవన్ మాజీ భార్య, అకీరా తల్లి రేణూ దేశాయ్ తెలిపారు.

అకీరా ఎడిట్‌ చేసిన వీడియోను రేణూ దేశాయ్‌ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన పవర్ స్టార్ ఇక కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘కొన్ని వారాల క్రితం వాళ్ల నాన్న కోసం అకీరా నందన్‌ చేసిన ప్రత్యేక వీడియో ఇది. పవన్‌పై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనం. తన తండ్రి విజయంపై అకీరా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాడు’ అని రేణు దేశాయ్‌ దీనికి క్యాప్షన్‌ జోడించారు. ‘ఖుషి’ నుంచి ‘భీమ్లానాయక్‌’ వరకు పవన్‌ చేసిన సినిమాల్లోని పవర్‌ఫుల్‌ డైలాగులతో దీన్ని ఎడిట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్​చల్ సృష్టిస్తోంది. ఈ వీడియో చూసి ‘గూస్‌బంప్స్‌ వస్తున్నాయంటూ’ కొందరు, ‘ఎమ్మెల్యే గారి అబ్బాయి చేసిన వీడియో బాగుంది’ అని ఇంకొందరు ‘ఇప్పటి వరకు చూసిన వాటిల్లో ఇదే బెస్ట్‌ వీడియో’ అని మరొకరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Last Updated : Jun 7, 2024, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.