ETV Bharat / state

సాగుదారుడికి సాంకేతికత అండ - హైదరాబాద్​లో ఘనంగా అగ్రిటెక్‌ సౌత్‌ ప్రదర్శన - Agritech Awareness on Agriculture

Agri Tech South Exhibition about innovation in Farming : వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో నూతన సాంకేతికత, అధునాతన యంత్రాలు రైతులకు చేరువ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పరిశ్రమ వర్గాలు సైతం తమ వంతు కృషి చేస్తున్నాయి. సాగు రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలు తెలుగు రాష్ట్రాల రైతులకు పరిచయం చేసేందుకు భాగ్యనగరం వేదికగా మూడు రోజుల పాటు అగ్రిటెక్ సౌత్ ప్రదర్శన సాగుతోంది. రైతు పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంచేందుకు దోహదపడే నాణ్యమైన వండగాలు సహా కృత్రిమ మేథ, డ్రోన్, రోబో తదితర సాంకేతికతలు ఆకట్టుకుంటున్నాయి.

Agri Tech South about Farming
Agri Tech South Exhibition about innovation in Farming
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 12:38 PM IST

Agri Tech South Exhibition about innovation in Farming : హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిటెక్ సౌత్ పేరిట వ్యవసాయ ప్రదర్శన సందడిగా సాగుతోంది. సాగులో వచ్చిన సాంకేతికతలను రైతులకు అందించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ, జయశంకర్ వర్సిటీ సహకారంతో సీఐఐ (C.I.I) ఆధ్వర్యంలో ప్రదర్శన, సదస్సు కొనసాగుతోంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించగా, అనేక కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ శాఖలు, వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలు కలిసి 125 పైగా స్టాళ్లు ఏర్పాటు చేశాయి. రైతుకు పెట్టుబడి తగ్గించి, ఆదాయం పెంచేలా ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, సూక్ష్మ సేద్య సాంకేతికతలు, ఇతర పనిముట్లు ప్రదర్శిస్తున్నారు.

వాతావరణ మార్పులతో ఎదురవుతున్న సవాళ్లు, ప్రత్యేకించి చీడపీడలు, ఉత్పాదకత పెంపు, శుద్ధి, నిల్వ, మార్కెటింగ్‌ వంటి అంశాలలో అవగాహన కల్పించనున్నారు. సాగు రంగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. పంట యాజమాన్యం, మార్కెటింగ్‌ వంటి సూచనలిచ్చేందుకు కృత్రిమ మేథ, డ్రోన్‌, అంతరిక్ష సాంకేతికలు అందించేందుకు ఎన్నో సంస్థలు, అంకురాలు ముందుకొస్తున్నాయి. వాతావరణ మార్పులు, వనరులు తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్త టెక్నాలజీ వాడకంపై ప్రయోగాత్మకంగా రైతులకు వివరిస్తున్నారు. ప్రత్యేకించి సాగులో అగ్రికల్చర్ లైఫ్ సైన్సెస్, ఇంటిగ్రేటివ్ ప్లాంట్ సైన్స్, ప్లాంట్ బ్రీడింగ్(Plant Breeding), జెనెటిక్స్‌పై విస్తృత పరిశోధనలు, ఫలితాలు అందించేందుకు కృషి సాగుతోంది.

ఇటీవల కాలంలో వరినాట్లు, కోతలు, పత్తి ఏరివేత సహా అనేక భారీ యంత్రాలను వివిధ కంపెనీలు ప్రదర్శిస్తున్నాయి. సుస్థిర సేద్యంలో భాగంగా వాణిజ్య పంటలతో పాటు, పప్పు ధాన్యాలు, కూరగాయలతో పాటు చిరుధాన్యాలను సాగు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తే, మార్కెట్‌లో మంచి ధరలు లభించి సేద్యం లాభసాటిగా మారుతుంది. భూసారం, మానవాళీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పర్యావరణం, భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉంటాయి. వ్యవసాయ శాఖ, పీజే టీఎస్​యూ(P.J.T.S.A.U), నాబార్డ్‌ సహకారంతో ఎవర్‌గ్రీన్ ఎనర్జీ ఎంటర్‌ప్రైజెస్‌(Ever Green Enterprises) సంస్థ బృందాలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

Agri Tech South about Farming : ఓ అత్యాధునిక ట్రక్‌ రూపొందించి భూసార పరీక్షలు, సేంద్రీయ ఎరువుల వాడకం, మార్కెటింగ్ వంటి అంశాలపై మొబైల్ అగ్రీ సర్వీసెస్ అందిస్తుండటం విశేషం. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల స్థాయిలోకి ఈ సాంకేతికత, యంత్రాలను తీసుకెళ్లాలని ప్రభుత్వం సంకల్పించింది. వ్యవసాయాన్ని విప్లవాత్మకం చేయడంపై శ్వేతపత్రం, డిజిటల్‌ విధానాన్ని విడుదల చేసిన సీఐఐ, కృత్రిమమేథ (AI), రిమోట్‌ సెన్సింగ్‌, రోబోటిక్స్‌ వంటి వ్యవస్థలు సేద్యాన్ని ఎలా పునర్నిర్మిస్తాయో వివరించింది.

సాగుదారుడికి సాంకేతికత అండ - మూడు రోజుల పాటు జరగనున్న అగ్రిటెక్‌ సౌత్‌ ప్రదర్శన

'మొక్కలు పెంచడమంటే నాకు ప్రాణం - ఆ ఆలోచనే నన్ను సేంద్రీయ వ్యవసాయంవైపు అడుగులు వేయించింది'

గిట్టుబాటు ధర కోసం పల్లి రైతుల కష్టాలు - చోద్యం చూస్తున్న మార్కెటింగ్​ శాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.