ETV Bharat / state

జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లూ ట్యాపింగ్​ - పర్సనల్ డేటా సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్ర - JUDGES PHONE TAPPING IN TELANGANA - JUDGES PHONE TAPPING IN TELANGANA

Telangana Phone Tapping Case Updates : స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ కేంద్రంగా జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్‌ చేసినట్లు తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది. ప్రభుత్వ కేసులు, బీఆర్​ఎస్​ నేతలకు సంబంధించిన కేసుల్ని పర్యవేక్షిస్తున్న న్యాయవాదులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లూ ట్యాప్‌ అయినట్లు న్యాయస్థానానికి పోలీసులు సమర్పించిన నిందితుడి నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొనడం కలకలం రేపుతోంది.

Bhujanga Rao Statement on Phone Tapping Case
Telangana Phone Tapping Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 7:24 AM IST

జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లూ ట్యాపింగ్​ - అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్ర (ETV Bharat)

Bhujanga Rao Statement on Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తవ్వేకొద్దీ కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు రాజకీయ నాయకుల ఫోన్లనే ట్యాప్‌ చేసినట్లు బహిర్గతం కాగా ఆ జాబితాలో జడ్జీలు, జర్నలిస్టులు ఉన్నట్లు కేసులో కీలక నిందితుడు, అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు వాంగ్మూలంలో తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది. వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారం సేకరించడం ద్వారా అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయాలనుకున్నట్లు భుజంగరావు వెల్లడించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై డీజీపీ, అదనపు డీజీపీలు క్షుణ్నంగా సమీక్ష జరిపేవారు కాదని, ట్యాప్‌ చేసే ప్రతి ఫోన్‌ నంబర్‌ను పరిశీలించేవారు కాదని ఆయన చెప్పారు.

Judges P hone Tapping in Telangana : ఎస్​ఐబీ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌ రావు, డీఎస్పీ ప్రణీత్‌రావు ఇష్టానుసారంగా వ్యవహరించారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. బీఆర్​ఎస్​కు మేలు చేకూర్చేందుకు 2018 శాసనసభ ఎన్నికలకు ముందే అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్‌ను సంప్రదించిన తర్వాతే ఎస్ఐబీలో ప్రభాకర్‌రావు స్పెషల్‌ ఆపరేషన్‌ టీంను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారానే మునుగోడు ఉపఎన్నిక సమయంలో మునుగోడు శివార్లలో రూ.కోటి పట్టుకోగలిగామని పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ డేటా రికార్డ్స్‌ విశ్లేషణపై ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు దృష్టి సారించారని వివరించారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వ విధానాలను ట్రోల్‌ చేసే వ్యక్తుల ఫోన్లపై ప్రణీత్‌రావు బృందం నిఘా పెట్టేదని వెల్లడించారు.

విద్యార్థి సంఘాల నేతల ఫోన్లనూ ట్యాప్‌ : అనంతరం టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ బృందాలతో క్షేత్రస్థాయి ఆపరేషన్లు నిర్వహించేవారన్న భుజంగరావు బీఆర్​ఎస్​ను ఇబ్బందిపెట్టే విద్యార్థి సంఘాల నేతల ఫోన్లనూ ట్యాప్‌ చేసేవారని తెలిపారు. బీఆర్​ఎస్​ ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో బయటపడేసేందుకు ఫోన్‌ ట్యాపింగ్‌ సమాచారం ఆధారంగా ఆపరేషన్లు చేపట్టేవారని చెప్పారు. ఈటల రాజేందర్‌ గులాబీ పార్టీ నుంచి సస్పెండ్‌ అయినప్పుడు, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, టీఎస్​పీఎస్సీ పేపర్‌ లీకేజీపై నిరుద్యోగ యువత ఆందోళనలు, ఎమ్మెల్యేలకు ఎర కేసు లాంటి సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పోలీసులకు సమాచారం చేరవేసి పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం జరిగేదని పేర్కొన్నారు.

ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు అవసరమైన సమాచారం కోసం ప్రభాకర్‌రావు తమకు ఆదేశాలిచ్చేవారని భుజంగరావు తెలిపారు. హైటెక్‌ సిటీలోని ఓ పెట్రోల్‌ బంక్‌ వ్యవహారంలో సంధ్య కన్వెన్షన్‌ శ్రీధర్‌రావు, అతడి వ్యాపార భాగస్వామితో సాంబశివరావుకు వివాదం ఏర్పడగా దీన్ని ఆసరాగా చేసుకొని బీఆర్​ఎస్​కు 15 కోట్ల నిధులు సమకూర్చాలని శ్రీధర్‌రావుపై ఒత్తిడి తెచ్చామని చెప్పారు. ఈ క్రమంలో శ్రీధర్‌రావు బీఆర్​ఎస్​ కోసం ఎస్‌బీఐ నుంచి 13 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు, సాంబశివరావుతో రాజీ కోసం 2 కోట్లు ఇచ్చారని వెల్లడించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ కామారెడ్డి నియోజకవర్గంలో బరిలో దిగడంతో ఆ ఎన్నిక కోసం కేఎంఆర్‌ పేరిట ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసినట్లు భుజంగరావు, తిరుపతన్నలు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు చెందిన డబ్బు అడ్డుకోడమే లక్ష్యంగా : బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిల కార్యకలాపాలపై నిఘా ఉంచుతూ గ్రూప్‌లో సమాచారాన్ని షేర్‌ చేసుకునేవారని తెలిపారు. కేసీఆర్‌ను గెలిపించేందుకు క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరించాలో చర్చించేవారని భుజంగరావు వెల్లడించారు. కొండల్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నాయకులపై కన్నేసి ఉంచడం ద్వారా కామారెడ్డి పోలీసులు 56 లక్షలు స్వాధీనం చేసుకున్నారని తిరుపతన్న పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌కు చెందిన డబ్బు రవాణాను అడ్డుకోడమే లక్ష్యంగా పని చేశామని అదనపు ఎస్పీ తిరుపతన్న పేర్కొన్నారు. ఇందుకోసం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.

ఇటీవలి శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలకు సంబంధించిన నగదు రవాణా సమాచారం విషయంలో ప్రణీత్‌రావుతో కలిసి పనిచేయాలని తనను ప్రభాకర్‌రావు ఆదేశించారని తెలిపారు. బృందంలో ఉన్నవాళ్లంతా వాట్సప్‌లోనే సంప్రదించుకునేవాళ్లమన్న తిరుపతన్న 40 నుంచి 50 మందికి చెందిన ఫోన్లను ట్యాప్‌ చేసే బాధ్యత బృందానికి అప్పగించారని వెల్లడించారు. సేకరించిన సమాచారాన్ని స్థానిక పోలీసులు, టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీకి చేరవేసి కాంగ్రెస్‌కు చెందిన డబ్బును విజయవంతంగా పట్టుకునేలా చూశామని వివరించారు. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా పెద్దమొత్తంలో డబ్బు పట్టుకోగలిగామని చెప్పారు.

పెద్దమొత్తంలో డబ్బు స్వాధీనాలు : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన గాలి అనిల్‌కుమార్‌కు చెందిన రూ. 90 లక్షలు, రేవంత్‌రెడ్డి మిత్రుడైన వినయ్‌రెడ్డి, మరో నలుగురి వద్ద రెండు కోట్ల రూపాయలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ ఇన్‌ఫ్రా డబ్బు పది కోట్లు, రాజగోపాల్‌రెడ్ది అనుచరుల నుంచి రెండున్నర కోట్ల రూపాయలు, విశాఖ ఇండస్ట్రీస్‌కు చెందిన కందుల రవికిశోర్‌ నుంచి రూ. 50 లక్షలు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నిహితుడైన గిరిధర్‌రెడ్డి నుంచి రూ.35 లక్షలు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి చెందిన రూ. 90 లక్షలు, ఖమ్మంలో పొంగులేటి అనుచరుడైన వ్యాపారి నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్‌కు చెందిన డబ్బు రవాణాను నియంత్రిస్తూ బీఆర్​ఎస్​కు సజావుగా డబ్బు రవాణా అయ్యేలా చూశామని తెలిపారు. ఇదంతా బీఆర్​ఎస్​ను మళ్లీ అధికారంలోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోనే జరిగిందని వివరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలు బయటపడకూడదని ప్రభాకర్‌రావు ఆదేశాలు, ప్రణీత్‌రావు సూచనల మేరకు 3 కంప్యూటర్ల హార్డ్‌ డిస్కులను ధ్వంసం చేశామన్నారు.

ప్రతిపక్ష నేతల డబ్బులపై ప్రత్యేక నిఘా - దాడుల కోసం తిరుపతన్న ప్రత్యేక టీమ్‌ - Tirupatanna ON PHONE TAPPING

ఫోన్​ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ - 'బీఆర్ఎస్ నేతల సూచనతో సెటిల్​మెంట్లు' - BHUJANGARAO ON PHONE TAPPING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.