Actress Meenakshi Chaudhary Visit Kadapa Ameen Peer Dargah: కడప పెద్ద దర్గాను సినీ తారలు దర్శించుకున్నారు. ముందుగా మీనాక్షి చౌదరి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా విశిష్టత గురించి అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. లక్కీ భాస్కర్ సినిమా విజయవంతాన్ని అస్వాదిస్తున్నానని ఆమె తెలిపారు. మీనాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. పెద్ద దర్గాను సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. "సంక్రాంతి వస్తున్నాం" సినిమా జనవరిలో వస్తుందన్నారు.
షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన మీనాక్షి: ముందుగా మీనాక్షిచౌదరి కడపలోని ద్వారకానగర్‌లో ఏర్పాటు చేసిన నూతన శుభమస్తు షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. నూతన వస్త్రాలయాన్ని జ్యోతి ప్రజ్యలన చేసి ప్రారంభించిన సినీనటి కొత్తకొత్త చీరలు, వస్త్రాలను పరిశీలించారు. కడపకు మొదటిసారిగా వచ్చినా మంచి స్వాగతం పలికారని ఆమె తెలియ జేశారు. సినీనటిని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. లక్కీభాస్కర్ సినిమా ద్వారా మంచి పేరు వచ్చిందని సంక్రాంతి పండుగకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా మంచి కామిడీతో వస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది మరిన్ని సనిమాలకు సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు.
NTR సినీ జీవితానికి 75 ఏళ్లు - 14న విజయవాడలో వజ్రోత్సవాలు
దర్గాల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అంజలి: కడప పెద్ద దర్గాను సినీనటి అంజలి కూడా సందర్శించారు. దర్గాను సందర్శించడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉందని అంజలి అన్నారు. దర్గా నిర్వాహకులు అంజలికి ముస్లిం సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. తలపై పూల చాదర్ పెట్టుకుని దర్గాలో సమర్పించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాకు రావడం ఇదే మొదటిసారి అని ఎప్పటినుంచో అనుకుంటున్నానని ఇప్పటికి కుదిరిందని ఆమె తెలిపారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటించానని త్వరలో మరిన్ని సినిమాలలో నటిస్తున్నానని చెప్పారు.
నంద్యాలలో కృతి శెట్టి సందడి: నంద్యాలలో సినీ తార కృతి శెట్టి సందడి చేశారు. పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. కృతి శెట్టిని చూసేందుకు భారీగా అభిమానులు వచ్చారు. నంద్యాలకు రావడం సంతోషంగా ఉందని కృతి శెట్టి అన్నారు. మరో వారం రోజుల్లో తను నటించే సినిమాను ప్రకటిస్తామని కృతి శెట్టి చెప్పారు.
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న నాగచైతన్య, శోభిత దంపతులు
మీరు కథ సిద్ధం చేస్తే కాకినాడ పోర్టు మాఫియాపై సినిమా తీస్తా : బాలయ్య