Allu Arjun Post On Shri Tej : కేసు విచారణ కొనసాగుతున్నందున శ్రీతేజ్‌ను కలవలేకపోతున్నానని హీరో అల్లు అర్జున్ తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడి గురించి ఆందోళన చెందుతున్నానని ఆయన సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు.
'బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం అతడిని(శ్రీతేజ్) కలవలేకపోతున్నా. వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతున్నాను. త్వరలోనే వారి ఫ్యామిలీని కలిసి మాట్లాడతాను. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నా'’అని అర్జున్ తెలిపారు.
బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా బన్నీ కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన సంగతి విధితమే. చికిత్స ఖర్చులూ భరిస్తానని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఆ ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈ నెల 13న అరెస్టు చేసిన సంగతి విధితమే. చంచల్‌గూడ జైలులోనే ఆ రాత్రంతా ఉన్న ఆయన హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు.