ETV Bharat / state

ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆస్తుల చిట్టా - ల్యాప్​టాప్​లో కీలక సమాచారం! - ACP UMA MAHESHWAR RAO ASSETS - ACP UMA MAHESHWAR RAO ASSETS

ACP Uma Maheshwar Rao Case Update : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన సీసీఎస్​ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీబీ వద్ద స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు విశ్లేషిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లో కీలక సమాచారం ఉందని భావిస్తున్న అనిశా 8 రోజుల కష్టడి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శనివారం విచారణ జరిగే అవకాశం ఉంది.

CCS ACP Uma Maheshwar illegal Assets
ACP Uma Maheshwar Assets in AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 6:55 AM IST

ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆస్తుల చిట్టా - ల్యాప్​టాప్​లో కీలక సమాచారం! (ETV Bharat)

ACP Uma Maheshwar Rao Case Update : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన సిసిఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరావు కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులకు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. సోదాల్లో భాగంగా ఏసీపీ ఆస్తులు చిట్టా బయటపడగా 8 రోజుల కష్టడి కోరుతూ ఏసీబీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2014 నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తులను సొంతంగా కాకుండా ఎక్కువగా అత్తామామల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. శామీర్‌పేట్‌లోని ఆర్​ఎస్​ కన్‌స్ట్రక్షన్‌లో 2022లో విల్లా కోసం పెట్టుబడి పెట్టినట్లు తేల్చారు. 333 చదరపు గజాల స్థలంలో 4,400 చదరపు అడుగుల సూపర్ బిల్టప్ ఏరియాతో నిర్మాణంలో ఉన్న ఈ విల్లా కోసం రూ.50 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు.

Uma Maheshwar Illegal Land Assets : 2017లో జవహర్‌నగర్ అయ్యప్ప నగర్‌ కాలనీ సమీపంలో 255 సర్వే నంబర్లో 3 గుంటల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం రూ.10 లక్షలు చెల్లించగా ఇది మదన్మోహన్ పేరిట విక్రయ ఒప్పందం రూపంలో ఉంది. అలాగే ఘట్‌కేసర్‌ మండలం ఘన్‌పూర్‌ గ్రామంలోని స్పారోస్ ప్లివోరాలో 159.22 చదరపు గజాల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం రూ.19,90,250 చెల్లించి దీన్ని తన అత్త సుశీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గుర్తించారు. ఇక్కడే 239.54 చదరపు గజాల ప్లాట్‌ను మామ సతీశ్‌బాబు పేరిట 2020లో రిజిస్టర్‌ చేయించి దీనికోసం సుమారు రూ.37,54,000 చెల్లించారని గుర్తించినట్లు సోదాల్లో అధికారులు తెలిపారు.

సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ - ఏసీబీ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు - ACB Raids On ACP Uma Maheswar House

CCS ACP Uma Maheshwar illegal Assets : శామీర్‌పేట్‌ మండలం తుర్కపల్లిలో సర్వేనం.530లో ఉమామహేశ్వరరావు వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. 2018లో శామీర్‌పేట్‌లో 14 గుంటల వ్యవసాయ భూమిని సుశీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. హైదరాబాద్ అశోక్ నగర్‌లోని అశోకా ఒర్నాట ఆపార్ట్‌మెంట్‌లో 1385 చదరపు అడుగుల ఫ్లాట్‌ను 2022లో సుశీల పేరిట రిజిస్టర్ చేయించారు. కూకట్‌పల్లి సర్వే నంబర్ 1007లో 200 చదరపు గజాల ప్లాట్‌ను 2017లో సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పినగాడిలో ఏడున్నర లక్షల విలువైన 25 సెంట్ల స్థలాన్ని మామ సతీష్ పేరిట 2014లో కొనుగోలు చేశారు.

ACP Uma Maheshwar Assets in AP : విశాఖపట్నం జిల్లా చోడవరం న్యూ శాంతినగర్ కో-ఆపరేటివ్ కాలనీలో రూ.4,80,000 విలువైన 240 చదరపు గజాల ప్లాటు 2014లో సతీశ్‌బాబు పేరిట కొన్నారు. చోడవరం మండలం దొండపూడి గ్రామంలో 209 సర్వే నంబర్లో 5.92 ఎకరాల స్థలాన్ని 2021లో రూ.32,56,000 వెచ్చించి తన పేరిట కొనుక్కున్నారు. అదే ఏడాది అక్కడే మరో 2.2ఎకరాల స్థలాన్ని రూ.12,10,000 వెచ్చించి కొన్నారు. ఇవి కాకుండా రూ.3,62,000 విలువైన గృహసామగ్రి, రూ.2,04,000 విలువైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు రూ.1,40,000 విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఏసీపీ అధికారులు గుర్తించారు.

ల్యాప్​టాప్​లో కీలక సమాచారం : ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఆస్తుల చిట్టా తేల్చేందుకు చేపట్టిన సోదాల క్రమంలో హైదరాబాద్‌లో మరో డీఎస్పీ ఇంట్లోనూ సోదాలు చేయడం చర్చనీయంగా మారింది. బర్కత్‌పురా హౌసింగ్‌ బోర్డు కాలనీ తారకరామ ఎస్టేట్లోని టీఎస్​ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మందడి సందీప్‌రెడ్డి ఫ్లాట్‌లోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరిద్దరూ హైదరాబాద్ సీఎస్​ఎస్​లో కలిసి పనిచేశారు. అయితే ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సందీప్‌రెడ్డికి ఏమైనా సంబంధముందా అని తేలాల్సి ఉంది. కాగా ఉమామహేశ్వరావు కొందరు పోలీస్ అధికారులతో కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నందున ఆ దిశగా అధికారులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి అతడి ల్యాప్‌టాప్‌లోని సమాచారాన్ని విశ్లేషించడంలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్​ - మరో డీఎస్పీ ఇంట్లోనూ సోదాలు - CCS ACP Umamaheswara Rao Remand

ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసు అప్డేట్​ - ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు - CCS ACP Umamaheswara Rao Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.