Union Ministers Convoy Accident in Visakha: విశాఖ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మ కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విశాఖ షీలానగర్ వద్ద కాన్వాయ్‌లో 3 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ప్రమాదానికి గురైన కార్లలో మాజీ ఎంపీ జీవీఎల్ కారు కూడా ఉంది. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. కాన్వాయ్‌లోని చివరి వాహనాలు ప్రమాదానికి గురయ్యాయని, ఇంక ఎవరికీ గాయాలు కాలేదని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. కేంద్రమంత్రులు కూడా క్షేమంగా ఉన్నారని తెలిపారు.
ఈ ఉదయం విశాఖపట్నం చేరుకున్న కేంద్రమంత్రి కుమారస్వామికి విమానాశ్రయంలో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్ అతిథిగృహం హిల్‌టాప్ గెస్ట్‌హౌస్‌కు కుమారస్వామి బయల్దేరగా ర్యాలీ నిర్వహించారు. గాజువాక సెంటర్, కూర్మన్నపాలెం, స్టీల్‌ప్లాంట్ టౌన్షిప్ మీదుగా ర్యాలీ సాగింది. పెద్ద ఎత్తున జనం, విద్యార్థులు, కూటమి పార్టీల కార్యకర్తలు రోడ్డుపైకి తరలివచ్చి కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎదురేగి రావడంతో ఆయన కారు దిగి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు.
యాక్సిడెంట్ జరిగిందా?! - మీరు ఆ పని చేస్తే పాతికవేల బహుమతి
ఏపీలో 'వాట్సప్ గవర్నెన్స్' - దేశంలోనే తొలిసారి 161 సేవలకు శ్రీకారం