ACB Raids On ACP Uma Maheswar Rao House : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావుకు చెందిన ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల చేపట్టిన సోదాలు ముగిశాయి. పదకొండు గంటలుగా 14 అనిశా అధికారులు సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలియజేశారు.
అశోక్‌నగర్‌లో ఉన్న అయన నివాసంతో పాటు అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న మరో రెండు ఇళ్లు సీసీఎస్ కార్యాలయం, నగరంలోని ఆయన మరో ఇద్దరి స్నేహితుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు చోట్ల ఈ సోదాలు జరిగాయి. ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.40 లక్షలు, భారీగా బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. సోదాల అనంతరం ఏసీబీ అధికారులు ఉమామహేశ్వర రావును అరెస్టు చేశారు.
కొనసాగుతున్న ఏసీబీ సోదాలు : సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా పనిచేసిన సమయంలో అక్రమార్జనతో భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉమామహేశ్వరరావుపై ఉన్నాయి. మరో వైపు ప్రస్తుతం అతను పనిచేస్తున్న సీసీఎస్‌లో పలు కేసుల్లో ముడుపులు పొందినట్లు అరోపణలు ఉన్నాయి. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు మద్దతు పలుకుతున్నారని పలువురు సోదాలు జరుగుతున్న సమయంలో అతని నివాసం వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. సోదాల్లో భాగంగా అతనికి సంబంధించిన బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలుస్తోంది. సోదాలు ముగిసిన అనంతరం పూర్తి విషయాలు వెల్లడిస్తామని అనిశా జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు.
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగళం.. ఎమ్మార్వో ఇంట్లో రూ.4.56 కోట్ల అక్రమాస్తులు.. రిమాండ్‌కు తరలింపు
Inspections by ACB officials in Andhra Pradesh too : మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉమామహేశ్వరరావుకు చెందినవారి ఇళ్లల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో తెలంగాణ అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ మేరుకు రోలుగుంటకు చెందిన మడు తమునాయుడు అనే వ్యక్తి ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో సీసీఎస్ డిఎస్పీ ఉమా మహేశ్వరావుకు ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి అతని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించి పలు కీలకమైన పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ముగిసిన ఏసీబీ సోదాలు : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు ముగిశాయి. సోదాల అనంతరం ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసినట్లుగా అనిశా అధికారులు తెలిపారు. ఏసీపీకి సంబంధించిన 17 చోట్ల స్థిర, చరాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లుగా వెల్లడించారు. ఇప్పటివరకు రూ.3 కోట్లకు పైగా విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో 4 ఇళ్లు గుర్తించామని అధికారులు తెలిపారు. శామీర్‌పేట, కూకట్‌పల్లి, మల్కాజిగిరిలో ప్లాట్లు కొన్నారని వెల్లడించారు. రేపు ఏసీపీ ఉమామహేశ్వరరావును కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లుగా సమాచారం.
హెచ్ఎండీఏ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు
లంచం డిమాండ్ కేసు.. బంజారాహిల్స్ సీఐ, ఎస్ఐ, హోంగార్డుకు ఏసీబీ నోటీసులు