ETV Bharat / state

వేములవాడ ఆలయంలో ఏసీబీ రైడ్స్ - పలు అధికారులపై బదిలీ వేటు - ACB RAIDS IN VEMULAWADA TEMPLE - ACB RAIDS IN VEMULAWADA TEMPLE

Officials Frauds In Vemulawada Temple : వేములవాడ రాజన్న ఆలయంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దేవదాయశాఖ అధికారుల లీలలు ఏసీబీ విచారణలో బయటపడ్డాయి. మూడు రోజుల క్రితం ఆలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్‌ రేంజ్‌ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ సోదాల్లో తప్పిదాలను గుర్తించి పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.

ACB Raids in Vemulawada Temple
ACB Raids in Vemulawada Temple (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 1:26 PM IST

Updated : Aug 27, 2024, 2:51 PM IST

ACB Raids in Vemulawada Temple : భక్తులకు కొంగు బంగారమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో రికార్డులను పరిశీలించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు స్టాక్‌ రిజిస్టర్లలో తప్పిదాలను గుర్తించారు. నెయ్యి, జీడిపప్పు, నూనెకు సంబంధించిన వివరాల్లో తేడాలు ఉన్నాయని తేల్చారు. ఆలయంలో మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా గుర్తించారు.

తలనీలాలు సమర్పించే ఒక్కో భక్తుని నుంచి రూ.50, 100 చొప్పున వసూలు చేస్తున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమని నిర్ధరించారు. కొత్త టెండర్ల విధానానికి దేవదాయశాఖ ఆమోదం లేకుండానే పాత టెండర్ల ద్వారానే వస్తుసామాగ్రి కొనుగోలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.

అన్న సత్రం, కోడెల నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు కేటాయించిన గదులు, వీఐపీల దర్శనాల వివరాలను పరిశీలిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కల్యాణం జరిపించే భక్తులకు ఇచ్చే ప్రసాద వితరణ, దాతల వివరాలు, సెక్యూరిటీ కోసం వెచ్చిస్తున్న ఖర్చుల వివరాలనూ సేకరిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. అనుబంధ ఆలయాల నిర్వహణ పేరిట వెచ్చిస్తున్న నిధులపైనా ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు.

రాష్ట్రంలో దూకుడు పెంచిన ఏసీబీ - పట్టుబడుతున్న అవినీతి అధికారులు - Prathidhwani on ACB Raids

"ఇన్​స్పెక్టర్స్, సిబ్బందితో పాటు వేములవాడకు వచ్చి తనిఖీలు చేశాం. ఈ ఆలయంపై ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి. అందుకే మేము తనిఖీ చేయడానికి వచ్చాం. తనిఖీల తర్వాత నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం. ప్రతి డిపార్ట్​మెంట్​లో తనిఖీలు చేస్తున్నాం." -రమణమూర్తి, ఏసీబీ డీఎస్పీ

తనిఖీల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన సిబ్బందిపై చర్యలు చేపట్టారు. ఈవో వినోద్‌రెడ్డి వారిని అంతర్గత బదిలీ చేశారు. కళ్యాణకట్టలో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లు ఒక పరిచారికను బాధ్యతల నుంచి తొలగించారు. ముగ్గురు ఆలయ సూపరిండెంట్లు, 9 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు రికార్డ్ అసిస్టెంట్లు, పరిచారికను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు పేర్కొన్నారు.

రూ.35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్టేట్‌ టాక్స్‌ ఆఫీసర్‌

మున్సిపల్​ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.6.07కోట్ల విలువైన సొత్తు స్వాధీనం - ACB Raids On Municipal Employee

Last Updated : Aug 27, 2024, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.