ETV Bharat / state

వెలుగులోకి వెంకటరెడ్డి లీలుల - చైనా యంత్రాలతో దోపిడీకి స్కెచ్‌ - AP

భూ సర్వేరాళ్ల కటింగ్‌ యంత్రాల కొనుగోలుకు ఎత్తుగడ - నాటి అడ్డగోలు దందాలపై విచారణ చేపట్టిన ఏసీబీ

ACB Raids in APMDC Office Updates
ACB Raids in APMDC Office Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2024, 7:18 AM IST

ACB Raids in APMDC Office Updates : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ పెద్దలు, ముఖ్యనేతలకు అడ్డగోలుగా దోచిపెట్టిన గనులశాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి తాను కూడా భారీగా లబ్ధి పొందారు. సర్వేరాళ్లను కట్‌ చేసేందుకు చైనా నుంచి యంత్రాలను తక్కువ ధరకు తెప్పించి, ఎక్కువ ధర పేరిట కోట్లు దోచేసేందుకు స్కెచ్‌ వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని గుర్తించిన ఏసీబీ టెండర్లు మొదలు, ఏ దశలో ఏం జరిగిందో, ఎవరెవరు ఏయే పాత్ర పోషించారో తేల్చే పనిలో పడింది. అప్పట్లో పనిచేసిన అధికారులను విచారిస్తోంది.

గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేలో భాగంగా, సర్వే రాళ్ల సరఫరా బాధ్యతను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ-ఏపీఎండీసీకి అప్పగించారు. అప్పట్లో గనులశాఖ సంచాలకుడిగా, ఏపీఎండీసీ ఎండీగానూ వెంకటరెడ్డి వ్యవహరించారు. పాలిషింగ్‌ యూనిట్లు, గ్రానైట్‌ కటింగ్ యూనిట్ల నుంచి రాళ్లు సరఫరా చేయాల్సింది పోయి, సంస్థ తరఫున కటింగ్, పాలిషింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు తహతహలాడారు. వాటిలో భారీగా డబ్బులు కొట్టేయాలని చూశారు.

బోస్‌తో కలిసి ప్రణాళిక : ఎప్పుడో మూతపడిన యూనిట్లైన చీమకుర్తిలో 10, చిత్తూరులో 10 చొప్పున 20 యంత్రాల ఏర్పాటుకు యత్నించారు. ఒక్కో యంత్రం విలువ రాజస్థాన్‌లో రూ.3 కోట్ల వరకు ఉండగా, చైనా నుంచి రూ.8 కోట్లకు కొనేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి ఏపీఎండీసీకి డిప్యుటేషన్‌పై వచ్చి, టెండర్లు, ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌గా ఉన్న బోస్‌తో కలిసి ప్రణాళిక రచించారు.

వెంకటరెడ్డి సన్నిహితుడు, విజయవాడకు చెందిన యు.కృష్ణప్రసాద్‌కు చెందిన ధన్వంతరీ అసోసియేట్స్‌ ద్వారా చైనా యంత్రాలు తీసుకొచ్చేందుకు చూశారు. 20 యంత్రాల కోసం రూ.160 కోట్లతో ఏపీఎండీసీ ద్వారా టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. అయితే రూ.100 కోట్ల విలువైన టెండర్లను న్యాయసమీక్షకు పంపాల్సి ఉంది. అందుకే వేర్వేరుగా 10 యంత్రాల చొప్పున రూ.80 కోట్ల అంచనా వ్యయంతో ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం జీఎం బోస్‌ విడివిడిగా టెండర్లు పిలిచారు. ఈ టెండర్‌ ధన్వంతరీ అసోసియేట్స్‌కే దక్కేలా పనులు చక్కబెట్టారు.

Mines Venkata Reddy Irregularities : వాస్తవానికి ధన్వంతరీ అసోసియేట్స్‌ వైద్య పరికరాల సరఫరాదారు. దానికి గ్రానైట్‌ యంత్రాలపై అనుభవం లేదు. అయినా వెంకటరెడ్డి పట్టించుకోలేదు. అప్పటి ఏపీఎండీసీ ఫైనాన్స్‌ విభాగం, మైనింగ్‌ అధికారులు, సలహాదారులు సహా అందరూ ధన్వంతరీ ద్వారా చైనా యంత్రాలు తీసుకోవద్దని అభ్యంతరం చెప్పారు. అయినా వెంకటరెడ్డి పట్టించుకోకుండా, బోస్‌తో కలిసి ముందడుగు వేశారు.

అడ్వాన్స్‌గా రూ.30 కోట్లు ఇచ్చేలా ఒత్తిళ్లు : టెండర్లలో బిడ్‌ దక్కించుకున్న ధన్వంతరీ అసోసియేట్స్‌ రూ.26 లక్షలు బ్యాంక్‌ గ్యారంటీగా చెల్లించింది. తర్వాత 20 శాతం మేర అంటే రూ.30 కోట్ల వరకు అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ వెంకటరెడ్డి ఒత్తిడి చేశారు. దీనికి ఫైనాన్స్‌ విభాగం అడ్డుచెప్పింది. ఈ ఫైలుపై ఏపీఎండీసీ బోర్డు భేటీ కాగా, చైనా యంత్రాల కొనుగోలుకు ఏపీ సర్కార్ అనుమతి తీసుకోవాలని తీర్మానించారు.

దీంతో దస్త్రాన్ని గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్దకు పంపారు. అప్పటికే ఈ వ్యవహారంపై ఆయనకు ఫిర్యాదులు అందటం, ఈ టెండర్లలో వెంకటరెడ్డి జోక్యం చేసుకున్నట్లు తేలడంతో, వీటి కొనుగోలుకి అనుమతివ్వలేదు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన వెంకటరెడ్డి ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం బోస్‌ను బాధ్యుడిని చేసి, ఆయన డిప్యుటేషన్‌ రద్దు చేయించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పంపించారు. వెంకటరెడ్డిపై చర్యలు లేకుండా సీఎంఓలోని అధికారి చక్రం తిప్పారు.

చైనా యంత్రాల కొనుగోలుపై విచారణ : మరోవైపు ధన్వంతరీ అసోసియేట్స్‌కు చెందిన కృష్ణప్రసాద్‌ అప్పటికే కొంత సొమ్ము ఖర్చుచేశానని, ఆ మొత్తం చెల్లించాలని ఒత్తిడి తెచ్చినా, ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు హడావిడిగా ధన్వంతరీ సంస్థ చెల్లించిన బ్యాంక్‌ గ్యారంటీ రూ.26 లక్షలను వెంకటరెడ్డి వెనక్కి ఇప్పించేశారు. తర్వాత చైనా యంత్రాల కొనుగోలు వ్యవహారంపై ఏసీబీ విచారణ ప్రారంభించింది.

అప్పట్లో ఆహ్వానించిన టెండర్లు, ప్రీబిడ్‌ సమావేశం మినిట్స్, ప్రభుత్వ అనుమతులు, ధన్వంతరీ అసిసోయేట్స్‌తోపాటు బిడ్లు వేసిన ఇతర సంస్థలు, వాటి సాంకేతిక, ఆర్థిక అర్హతలు, ఏపీఎండీసీతో చేసుకున్న ఒప్పంద పత్రాలు, వీటికి చెందిన అంతర్గత నోట్స్, మెమోలు, మెయిల్స్, అనుమతులు, అడ్వాన్స్‌ చెల్లింపులు, బ్యాంకు గ్యారంటీ తదితర 16 ప్రశ్నలకు సమాచారం ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు ఈనెల 24న ఏపీఎండీసీ ఎండీకి లేఖ రాశారు. ఏపీఎండీసీ కార్యాలయానికి వచ్చి విచారణ జరిపారు. బోస్‌తో పాటు బ్యాంక్‌ గ్యారంటీ విడుదల చేసిన అసిస్టెంట్‌ మేనేజర్‌ సంతోష్‌ను అధికారులు విచారించారు. ఏపీఎండీసీ కార్యాలయంలోనూ ఈ టెండర్లకు సంబంధించిన ఫైళ్లు, ఆన్‌లైన్‌ బిడ్లను పరిశీలించారు. మరికొన్ని రోజులపాటు ఇక్కడే మకాం వేసి కూపీ లాగనున్నారు.

అడ్డగోలుగా దందా : చైనా యంత్రాలను తెచ్చేముందు వెంకటరెడ్డి మరో అడ్డగోలు దందా కూడా చేశారు. బాపట్ల జిల్లా బల్లికురవ, అనంతపురం జిల్లా తాడిపత్రి, చిత్తూరు, శ్రీకాకుళంలలో సర్వే రాళ్ల కటింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ ఒక్కో యూనిట్‌కు రూ.12 నుంచి రూ.13 కోట్లు వ్యయమవుతుందని ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం బోస్‌ అంచనా వేశారు. అయితే ఓ అధికారి రాజస్థాన్‌ వెళ్లి ఆరా తీయగా, ఒక్కో యంత్రం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లకే లభిస్తుందని గుర్తించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి టెండర్లు పిలిచారు.

ఈ క్రమంలోనే బోస్‌కు పరిచయమున్న ఒడిశాకు చెందిన ఉత్కల్‌ అనే కంపెనీని రంగంలోకి దించారు. దానితోపాటు మరో రెండు కంపెనీలతో బిడ్లు వేయించారు. ఈ మూడు కంపెనీల్లోనూ ఒకే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్నారు. అయినా ఆ టెండర్లను ఆమోదించారు. ఉత్కల్‌ సంస్థకే బిడ్​ను కట్టబెట్టారు. బల్లికురవలో మొదటి యూనిట్‌ ఏర్పాటుకు రూ.12.5 కోట్లు చెల్లించారు. అనంతపురం జిల్లాలో మరో యూనిట్‌ ఏర్పాటుకు కొన్ని పనులు జరగ్గా రూ.4 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. అంతలోనే ఏపీఎండీసీ బోర్డు సమావేశంలో దీనిపై పెద్ద చర్చ జరిగింది.

ACB Inquiry on Venkata Reddy : ఉత్కల్‌ సంస్థకు యంత్రాలు సమకూర్చే అర్హతలేదని, అది వైద్య సంబంధిత వస్తువులు తయారుచేసే సంస్థ అని అప్పటి ఏపీఎండీసీ ఛైర్మన్‌ ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ సంస్థ ఉన్నతాధికారులైన కేథార్‌నాథ్‌రెడ్డి, నెథానియేల్, లక్ష్మణరావులతో కమిటీ వేశారు. వీళ్లు కూడా ఈ టెండర్లలో ఉల్లంఘనలు జరిగాయని నివేదిక ఇచ్చారు. దీంతో మిగిలిన చోట్ల ఆ యూనిట్ల ఏర్పాటు ఆగిపోయింది. దీనిపై గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విచారణకు ఆదేశించగా, ఎక్కడా తప్పు జరగలేదంటూ వెంకటరెడ్డి ఓ నివేదిక పంపించి, సీఎంఓలోని కీలక అధికారి అండతో బయటపడ్డారు. ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ జరిపితే, వెంకటరెడ్డి అడ్డగోలు దందాలు వెలుగుచూసే అవకాశముంది.

ప్లీజ్​ నన్ను ఏమి అడగొద్దు - వాళ్ల పేర్లు చెప్పలేను - ACB Inquiry on Venkata Reddy

రూ.2600కోట్ల ఇసుక కుంభకోణంలో పెద్దల ప్రమేయం - 'క్లూ' రాబట్టిన పోలీసులు! - Venkata Reddy ACB Custody Inquiry

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.