ETV Bharat / state

వికారాబాద్ యువకుడి జాక్​పాట్ - రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్​లో కొలువు - A YOUNG MAN GETS A JOB ON AMAZON

వికారాబాద్ జిల్లా యువకుడికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - 2019లో ఐఐటీ పట్నా నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి

A Job On Amazon package Of RS 2Crores
A Young Man Gets A Job On Amazon (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2024, 9:46 AM IST

A Young Man Gets A Job On Amazon: ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్​లో తెలంగాణ యువకుడు జాక్​పాట్ కొట్టాడు. ఏకంగా రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అర్బాజ్‌ ఖురేషీ అరుదైన అవకాశం అందుకున్నాడు. ఐటీ కంపెనీ అమెజాన్‌లో రూ.2 కోట్ల ప్యాకేజీతో అప్లైడ్‌ సైంటిస్ట్‌ ఉద్యోగం సాధించాడు. ఈరోజు విధుల్లో చేరనున్నారు. తమ అబ్బాయి అనుకున్నది సాధించాడని ఖురేషీ తల్లిదండ్రలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐఐటీ పట్నా నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ : 2019లో ఐఐటీ పట్నా నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆయన మూడో సంవత్సరంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మెషిన్‌ లెర్నింగ్‌ కోవిదుడు గేల్‌ డయాస్‌ వద్ద 3 నెలలు ఇంటర్న్‌షిప్‌ చేశారు. అనంతరం బెంగళూరులోని మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌లో రెండేళ్లు పనిచేశారు. 2023లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ నుంచి ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌లో ఎంఎస్‌ పట్టా సాధించాడు. యువకుడి తండ్రి యాసిన్‌ ఖురేషీ ప్రస్తుతం ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌గా పని చేస్తున్నారు. కొడుకు ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించటం ఆనందంగా ఉందని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.