ETV Bharat / state

సివంగి సులీల - మావోయిస్టులనే ఎదిరించి తండ్రిని కాపాడుకున్న షీరో - DAUGHTER SAVES FATHER FROM MAOISTS

Daughter Rescued Father From Maoists Attack : ఏ కూతురుకైనా నాన్నే హీరో. అలాంటి నాన్న ప్రాణాలకే ముప్పు ఏర్పడితే ఆమె వీరోచితంగా పోరాడుతుంది. ఏదో విధంగా కాపాడుకోవాలని చూస్తుంది. అచ్చం ఇలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తండ్రిని చంపేందుకు వచ్చిన మావోయిస్టులను ఓ కుమార్తె ధైర్యంగా ఎదుర్కొంది.

Chhttisgarh Incident
Chhttisgarh Incident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 11:49 AM IST

Chhattisgharh Father Daughter Rescue: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణ్‌పూర్‌ జిల్లా ఝురాగావ్‌లో నివసిస్తున్న సోమధర్‌ కోరం అనే వ్యక్తి స్థానిక పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని, అతన్ని హతమార్చేందుకు మావోయిస్టులు వ్యూహం రచించారు. సోమవారం రాత్రి 8 మంది ద్విచక్ర వాహనాలపై వచ్చి ఇంటి వద్ద ఉన్న సోమధర్‌పై ఒక్కసారిగా మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. అక్కడే ఉన్న ఆయన కుమార్తె సులీల వారిని ప్రతిఘటించింది.

దాడి చేస్తున్న ఓ వ్యక్తి చేతిలోని గొడ్డలిని లాక్కొని పెడబొబ్బలు పెడుతూ సివంగిలా ఎదురు దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు గుమిగూడడంతో భయపడిన మావోయిస్టులు పారిపోయారు. సోమధర్‌ మెడపై గొడ్డలి గాయం కావడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన తండ్రి ప్రాణాలను కాపాడుకునేందుకు సులీల చేసిన ధైర్యాన్ని స్థానికులు కొనియాడారు. బిడ్డ ముందు తండ్రి నిలబడితే వాడే వంద దేవుళ్ల లెక్క అనే దగ్గర నుంచి కూతురే దేవతలా ముందు నిలబడి కాపాడినందుకు గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.