ETV Bharat / state

ఇదెక్కడి విడ్డూరం నాయనా! - అలా చేయొద్దన్నందుకు భర్తపై విచిత్రమైన కేసు పెట్టిన భార్య - Woman Files Complaint On Husband - WOMAN FILES COMPLAINT ON HUSBAND

Woman Files Complaint On Husband : భర్త తనను వేధిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది మాములు విషయమే కదా అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆమె అలా ఎందుకు ఫిర్యాదు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. భర్త తనను ఫ్రెంచ్ ఫ్రైస్​ తినొద్దన్నందుకు అతడిపై గృహ హింస కేసు పెట్టింది. చివరికి ఏం జరిగిందంటే?

Woman Files Complaint On Husband
Woman Files Complaint On Husband (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 2:16 PM IST

Woman Filed Complaint Against Her Husband : తనను భర్త వేధిస్తున్నాడంటూ గృహ హింస చట్టం కింద ఓ మహిళ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆమె వాదన సరికాదని - తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ ఆమె భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విషయం ఏమిటో తెలుసుకున్న జస్టిస్ ఎం.నాగ ప్రసన్న ఆశ్చర్యపోయారు. భర్త తనను ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తిననివ్వడం లేదన్నది ఆ గృహిణి వాదన.

కాన్పు అనంతరం పౌష్టికాహారం, పండ్లు, పాలు తదితరాల బదులుగా బంగాళ దుంపలతో చేసిన ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినొద్దన్నందుకు తనపైనే భార్య కేసు పెట్టిందని ఆ వ్యక్తి న్యాయస్థానం ముందు మొరపెట్టుకున్నాడు. భార్య ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని తినొద్దని వారిస్తే ఎదురు కేసు పెట్టడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి అతడిపై నమోదైన కేసులపై స్టే విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.