Student Suicide in Cherial : ఈ రోజుల్లో పిల్లలు చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూసి భయపడి ప్రాణాలు తీసుకుంటున్నారు. వారి బాధను ఇతరులకు పంచుకోవడానికి కూడా ఇష్ట పడటం లేదు. అందరిలో ఉన్నప్పుడు వారిని వేలేత్తి చూపిస్తే అంతే తీవ్ర కుంగుబాటుకు లోనై ఆత్మహత్యలు చేసుకుని కని పెంచిన తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగులుస్తున్నారు. ఒంటరిగా ఉంటూ ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. దాని వల్ల టెన్షన్ పెరిగి ఏది చేయాలనిపిస్తే అది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేస్తున్నారు. ఇంకొందరు అందరి ముందు అవమానం జరిగిందని భావించి చనిపోతున్నారు. అలాంటి ఘటనే సిద్ధిపేట జిల్లాలో జరిగింది.
పరిక్షలో చూసి రాశాడని ప్రిన్సిపల్ కొట్టడంతో పాటు తన తండ్రికి చెప్పగా అతను వచ్చి తోటి విద్యార్థుల ముందు ఆ విద్యార్థిపై చేయి చేసుకున్నాడు. అది భరించలేని ఆ విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో శనివారం (అక్టోబర్ 26)న చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలంలో ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల విద్యార్థి స్థానికంగా అందుబాటులో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
తండ్రి కోపం?: శుక్రవారం (అక్టోబర్ 25) పాఠశాలలో జరిగిన ఓ పరీక్షలో కాపీ కొడుతున్న విద్యార్థిని గమనించిన ప్రిన్సిపల్ అతన్ని కొట్టి తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ విద్యార్థి తండ్రి పాఠశాలకు వచ్చి కోపంతో అతన్ని తోటి విద్యార్థుల ఎదుట రెండు దెబ్బలు కొట్టాడు.
ముందుగా ప్రిన్సిపల్ కొట్టి తన తండ్రి ఫిర్యాదు చేయగా ఆయన కూడా చేయి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఆ విద్యార్థి శనివారం ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్ధిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మీ టార్చర్ వల్లే మా పాప సూసైడ్ చేసుకుంది - బాచుపల్లి కాలేజీపై తల్లిదండ్రుల ఆగ్రహం
గంజాయి ఆరోపణలతో కానిస్టేబుల్ మనస్తాపం - సెల్ఫీ వీడియో తీసి మరీ!