Kokapet Layout Road : హైటెక్ సిటీ వాసులకు శుభవార్త. కోకాపేట పేరు చెప్పగానే కోట్లకు పడగలేత్తే భూములు, అక్కడే ఓ పెద్ద నియోపొలిస్ లేఅవుట్ ఉంది. దీని నుంచి అవుటర్ రింగ్ రోడ్డుపైకి నేరుగా వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ఓ ప్రత్యేక మార్గం ఏర్పాటు అయింది. ఈ అతిపెద్ద లేఅవుట్ నుంచి ఓఆర్ఆర్పైకి వెళ్లేలా నాలుగు వరుసల్లో ప్రత్యేక మార్గం పనులు ఓ కొలిక్కి వచ్చాయి. ఇందుకోసం హెచ్ఎండీఏ దాదాపు రూ.80 కోట్లను వెచ్చిస్తోంది. ఈ మార్గం పొడవు లేఅవుట్ నుంచి దాదాపు 1.27 కిలోమీటర్లు. కోకాపేటతో పాటు చుట్టుపక్కల నుంచి దాదాపు 15-20 లక్షల మంది నిత్యం అవుటర్‌పైకి సులువుగా వెళ్లేలా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో స్థిరాస్తి మార్కెట్ వృద్ధికి కూడా ఉపయోగపడుతుందని హెచ్ఎండీఏ భావిస్తోంది.
ఒకవైపు గండిపేట జలాశయం, మరోవైపు ఓఆర్ఆర్, అక్కడి నుంచి చూస్తే అద్భుతమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కనుచూపు మేరకు కనిపించే ఆకాశ హర్మ్యాలు, వాటి చుట్టూ గేటెడ్ కమ్యూనిటీలు, మధ్యలో 500 ఎకరాల్లో కోకాపేట లేఅవుట్. దీన్ని గతంలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఇదే లేఅవుట్ హైదరాబాద్ మహానగరానికి సరికొత్త హాట్‌స్పాట్‌గా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యుత్తమ వసతులతో దీన్ని నిర్మిస్తున్నారు. విశాలమైన అంతర్గత రహదారులు. నగరానికి నలువైపులా వెళ్లేలా అనుసంధానదారులు, తాగునీటి వ్యవస్థ, మురుగునీటి వ్యవస్థ, ఇతర అన్ని సౌకర్యాలు కల్పిస్తూ హెచ్ఎండీఏ రూ.450 కోట్లు వెచ్చించి నిర్మిస్తోంది.
2023లో ఎకరం రూ.100 కోట్లు : 2023లో ఈ లేఅవుట్లో ఎకరం రూ100 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. స్థిరాస్తి మార్కెట్లో ఇదొక సంచలనంగా మారింది. ఇప్పటికే చాలా వరకు లేఅవుట్ సిద్ధంకాగా, ఇందులో ప్రముఖ స్థిరాస్తి సంస్థలు నిర్మాణాలను ప్రారంభించగా, కొన్ని వాణిజ్య భవనాల సముదాయాల నిర్మాణాలు కొలిక్కి వచ్చాయి. అత్యంత ఎత్తుతో కూడిన 56 అంతస్తుల భవనాలకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.
పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, ప్రముఖ సంస్థలు, వాణిజ్య సంస్థలు ఇక్కడ నిర్మాణాలను చేపట్టాయి. భవిష్యత్తులో ఈ లేఅవుట్ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంగా మారనుంది. నగరం నలువైపులా నుంచి ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పాటు ఎయిర్‌పోర్టు, ఇతర ప్రాంతాలతో అనుసంధానం చాలా ముఖ్యమైన పని. అయితే ఇప్పుడు నిర్మించిన ప్రత్యేక మార్గం అందుకు ఉపయోగపడుతుంది.
త్వరలో మిగతా భూమి వేలం : కోకాపేట లేఅవుట్లో వివిధ సంస్థలకు కేటాయింపులు, విక్రయించడం చేయగా ఇంకా 24 ఎకరాల భూమి మిగిలిపోయింది. గతంలో ఎలాంటి వసతులు లేని సమయంలోనే 45.33 ఎకరాలు వేలం వేస్తే ప్రభుత్వానికి రూ.3,319 కోట్లు ఆదాయం రాగా, ఎకరా సరాసరి రూ.73.25 కోట్లు పలికింది అప్పుడు. ఇప్పుడు అన్ని వసతులు ఉండటంతో ఈ 24 ఎకరాల భూమి ఎంత ధర పలుకుతుందో చూడాలి. ఈసారి భారీ మొత్తం రావడం ఖాయం అనిపిస్తోందని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి అధికారులు పంపారు. ఆన్లైన్లో వేలం వేసేందుకు సర్కారు అనుమతించగానే ప్రక్రియను ప్రారంభించనున్నారు.
అక్కడ గజం రూ.లక్ష - అయినా అందరి చూపూ అటు వైపే - Real Estate Business in Hyderabad
Kokapet Land Auction : కోట్లు కురిపించిన కోకాపేట నియోపోలీస్ భూముల వేలం.. ఎకరానికి ఎంతంటే ?