ETV Bharat / state

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో హైదరాబాద్‌ వాసి మృతి, రష్యాలో భారత ఎంబసీ అధికారుల ప్రకటన - Hyderabad man Died in Russia War

Hyderabad Man Died Russia-Ukraine war : రష్కా- ఉక్రెయిన్‌ పోరులో హైదరాబాద్‌ వాసి మృతి చెందాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ నగరానికి చెందిన మహ్మద్‌ అఫ్సాన్‌(30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు.

Hyderabad_Man_Died_Russia_Ukraine war
Hyderabad_Man_Died_Russia_Ukraine war
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 9:10 PM IST

Updated : Mar 6, 2024, 10:32 PM IST

Hyderabad Man Died Russia-Ukraine war : ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లి అక్కడి ఏజెన్సీ చేతిలో మోసపోవడంతో, రష్యన్ ఆర్మీలో చేరి హైదరాబాద్ యువకుడు ప్రాణాలు వదిలాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ నగరానికి చెందిన మహ్మద్‌ అఫ్సాన్‌(30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు.

నాంపల్లిలోని బజార్​ఘట్​కు చెందిన అఫ్సన్(Mohammad Afsan) మృతి చెందినట్టు, రష్యాలోని ఇండియన్ ఎంబసీ నుంచి తమకు సమాచారం వచ్చిందని అఫ్సాన్ సోదరుడు ఇమ్రాన్ పేర్కొన్నారు. ముంబైకి చెందిన ఏజెంట్ల సాయంతో అఫ్సాన్ ముందుగా దుబాయ్ చేరుకున్నాడని, అక్కడ నుంచి ఏజెంట్లు అతన్ని మాస్కో తరలించారని ఆయన తెలిపారు. అక్కడ కొన్ని పత్రాలపై అఫ్సాన్​తో సంతకాలు చేయించుకుని, రష్యా సైన్యంలో స్లీపర్ ఉద్యోగం అంటూ సైన్యంలో చేర్పించారని పేర్కొన్నారు.

రెండు రోజుల శిక్షణ తర్వాత అఫ్సాన్ సైన్యంలో విధులు నిర్వర్తించాడని, తన సోదరుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని రష్యాలోని ఇండియన్ ఎంబసీని సంప్రదించగా అక్కడి అధికారులు ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన సోదరుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి రప్పించాలని కోరారు. అఫ్సాన్​ను తప్పుదోవ పట్టించి సైన్యంలో చేర్పించిన ఏజెంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న దాదాపు 20 నుంచి 30 మంది భారతీయులను, సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన కొద్ది రోజులకే ఈ విషాదం వెలుగుచూసింది. రష్యా సైన్యంలో ప్రస్తుతం ముగ్గురు హైదరాబాదీలు ఉన్నారు. ఈ ముగ్గురిని ఇండియాకు తీసుకురావాలని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గతంలోనే భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఇంతలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

మరోవైపు మహ్మద్ అఫ్సాన్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సాయం కోసం అతడి కుటుంబం ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీని సంప్రదించింది. ఓవైసీ కూడా విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించారు.

KTR Reacts on Hyderabadi Death in Russia : మరోవైపు అఫ్సాన్ మృతిపై బీఆర్​ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. మృతుడు అఫ్సాన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న యువకులను రప్పించాలని ఆయన తన ట్వీట్​లో విజ్ఞప్తి చేశారు.

Last Updated : Mar 6, 2024, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.