ETV Bharat / state

రోడ్డుపైకి ఒంటరిగా వెళ్లడమే ఈ కుక్క చేసిన పాపం - A PET DOG THEFT CASE IN PADDAPALLI

పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు - తీవ్ర బాధతో కుటుంబ సభ్యులు - కుక్కను తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన యజమాని

PEDDAPALLI DISTRICT THEFT CASES
DOG THEFT CASE IN PEDDAPALLI (ETV bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2024, 4:50 PM IST

Updated : Nov 5, 2024, 5:06 PM IST

Pet Dog Theft in Peddapalli : పెంపుడు జంతువులను పెద్దపెద్ద సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. ఎంత పని ఉన్నా వాటికి కొంత సమయం కేటాయిస్తుంటారు. ఆ జాబితాలో కుక్కలది ప్రత్యేక స్థానం. మూగ జీవాలలో అత్యంత విశ్వాసమైన జంతువుల్లో కుక్కకే తొలి ప్రాధాన్యం. అందుకే శునకాలను చాలామంది ప్రేమతో పెంచుకుంటారు. కొంతమంది పెంపుడు కుక్కలను ఇంట్లో మనిషిలా స్థానం ఇచ్చి మరి చూస్తుంటారు.

అలాంటి పెంపుడు జంతువులకు బయట మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. అందుకే అడపాతడపా వీటిని దొంగలించే వారు ఉన్నారు. బయటి మార్కెట్లో అమ్ముకునేందుకు కొందరు, తామే పెంచుకునేందుకు మరికొందరు ఇలా చోరీలకు పాల్పడుతుంటారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్​నగర్​లో ఇలాంటి ఘటనే జరిగింది. హచ్ బ్రీడ్​కు చెందిన ఓ పెంపుడు​ కుక్క చోరీకి గురైంది. శ్రీరామ్​ నగర్​ కాలనీలో నివాసం ఉంటున్న అప్పరి నారాయణ అనే వ్యక్తి ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కను శనివారం (నవంబర్ 02)న మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు ఓ బైక్​ పై వచ్చి అపహరించారు.

సీసీ ఫుటేజీలో రికార్డు : ఓ ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై వెళ్తుండగా, ఇంటి ముందు ఆడుకుంటున్న హచ్ కుక్కను చూసి దానిని ఎత్తుకెళ్లిపోయారు. ఈ గ్యాంగ్​లో ఓ యువతి కూడా ఉండడం గమనార్హం. ఎవరి కంట పడకుండా ఆమె చున్నితో కుక్కను దాచిపెట్టింది. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కుక్క చోరీకి గురైందనే బాధతో రెండ్రోజులుగా యజమాని అప్పరి నారాయణ కుటుంబం తీవ్ర నిరాశలో ఉందని తెలిపారు. నారాయణకు ఇద్దరు కూతుర్లు ఉండగా పెంపుడు కుక్కను మూడో కూతురుగా పెంచుకుంటున్నామని అన్నారు. దయచేసి తమ కుక్కను తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఇటీవల కుక్కలు, పిల్లులను పెంచుకోవడం విపరీతంగా పెరిగింది. సోషల్​ మీడియాలోని వీడియోలే ఇందుకు సాక్ష్యం. కేవలం ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పదిన్నర వేల పెంపుడు కుక్కలు నమోదై ఉండగా, రిజిస్టర్ ​కానివి మరో 42 వేలున్నాయి. నగరాలు, పట్టణాల్లో ఇటీవల పెట్‌ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్స్​ సెంటర్​లు మరింత అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కమర్షియల్​ లైసెన్స్‌లు తీసుకున్న పెట్‌ క్లినిక్‌లు రాష్ట్రవ్యాప్తంగా 1,012 నడుస్తున్నాయి.

ప్రపంచంలో అత్యంత కాలం జీవించిన కుక్క- 'బ్లూయ్' లైఫ్​ స్పాన్ తెలిస్తే షాకే! - World Longest Lived Dog

4నెలల క్రితం యజమాని మృతి- మార్చురీ ముందు పెంపుడు కుక్క ఎదురుచూపులు!

Last Updated : Nov 5, 2024, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.