ETV Bharat / state

బ్యాంకు అధికారులకు కుచ్చుటోపీ - నకిలీ గోల్డ్‌ తనఖా పెట్టి రూ.54లక్షల రుణం, ఎక్కడంటే? - fake gold loan incident

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 7:34 PM IST

Fake Gold loan Incident : నకిలీ బంగారంతో పెద్దమొత్తంలో గోల్డ్‌లోన్‌ తీసుకుని బ్యాంక్ అధికారులను మోసం చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. కేశవరం రాజేష్ అనే వ్యక్తి నకిలీ బంగారాన్ని కుదువపెట్టి రూ. 53 లక్షల 89 వేల రుణం తీసుకున్నాడు. అనుమానం వచ్చి బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

FAKE GOLDLOAN IN SURYAPET
Fake Gold loan Incident (ETV Bharat)

Fake Gold loan Incident : ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు వీలైనంతా త్వరగా రుణం పొందాలంటే బంగారం కుదువ పెట్టడమే సరైన మార్గం. మనం తీసుకెళ్లిన బంగారంపై బ్యాంక్ అధికారులు అన్నిపరీక్షలు నిర్వహించిన అనంతరం అసలైనదేనా? నకిలీదా? అని నిర్ధారించుకున్న తర్వాతే రుణం మంజూరు చేస్తారు. ఇతను మాత్రం నకిలీ బంగారంతో బ్యాంక్‌ అధికారులను బురిడి కొట్టించాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రూ. 53 లక్షల 89 వేల గోల్డ్‌లోన్ తీసుకుని మోసం చేసే ప్రయత్నం చేశాడు. అసలు బంగారు రుణం ఎలా పొందాడంటే..

రంగునీటిలో ముంచితే మీ డబ్బు డబుల్ - ఈ నయా మోసం గురించి తెలుసా? - BIHAR GANG FRAUDS IN NALGONDA

సూర్యాపేట జిల్లా రాయినిగూడెం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో నకిలీ బంగారం స్కాం వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో అధికారులు ఆడిటింగ్‌లో భాగంగా తనీఖీలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. నేరేడుచర్ల మండలం వైకుంఠ గ్రామానికి చెందిన కేశవరం రాజేష్, వృత్తిరీత్య బంగారం పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడ గోల్డ్ వర్క్‌షాప్ ప్రారంభించాడు. అందులో నష్టాలు రావడంతో బాగా అప్పులు చేశాడు.

గోల్డ్ అప్రైజర్‌తో ఒప్పందం.. అప్పులు తీర్చడం కోసం ఏపీలోని తెనాలి, నెల్లూరులో నకిలీ బంగారు గొలుసు తయారు చేయించాడు. ఆ నగలపై ఎవరికి అనుమానం రాకుండా కేడియం 916 హాల్ మార్కులు వేయించాడు. సదరు బంగారాన్ని రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో పనిచేస్తున్న పాత మిత్రుడు గోల్డ్ అప్రైజర్ జిల్లేపల్లి నరేందర్ దగ్గరికి తీసుకువచ్చి బంగారం నిజమైందని ధ్రువకరించి లోన్ మంజూరు చేయించాలని కోరాడు. వచ్చిన లోన్ నగదుతో కొంత ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని, రూ.53 లక్షల 89 వేల లోన్ తీసుకున్నాడు.

రాజేష్ అతని భార్య వర్షిత బంధువులు పేరుమీద పెట్టి బంగారం తీసుకున్నాడు. బ్యాంక్‌లో గోల్డ్ లోన్ తీసుకొని చాలా సంవత్సరాలు అవుతున్న తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు అనుమానం వచ్చి బంగారాన్ని పరీక్షించారు. సదరు వ్యక్తి తాకట్టు పెట్టిన బంగారం నకిలీదని బ్యాంకు అధికారులు గుర్తించారు. నిందితుడు రాజేశ్‌పై బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

విద్యార్థులకు ఉచిత విద్య, ఆహారం పేరిట రూ.300 కోట్ల స్కాం - ఎక్కడో తెలుసా? - ed raids on om company fraud

గోల్డ్​ ట్రేడింగ్​లో పెట్టుబడుల పేరిట భారీ మోసం - 500 మంది దగ్గరి నుంచి రూ.కోట్లలో వసూలు! - Investment Fraud in Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.