ETV Bharat / state

మూడో అంతస్థులోని పిట్టగోడ కూలి భర్త మృతి - భార్య, కుమారుడికి తీవ్ర గాయాలు - Wall Collapse One Person Died - WALL COLLAPSE ONE PERSON DIED

One Person Died after the Wall Collapse : ఓ వ్యక్తి మూడో అంతస్థులో ఉన్న పిట్టగోడకు జారబడి ఫోన్​లో మాట్లాడుతున్నాడు. అంతలోనే ఆ పిట్టగోడ కూలి పక్కనున్న రేకుల ఇంటిపై పడగా, గాఢ నిద్రలో ఉన్న భర్త మరణించగా, భార్య, కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో జరిగింది.

One Person Died after the Wall Collapse
One Person Died after the Wall Collapse (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 11:42 AM IST

Wall Collapse One Person Died in Sangareddy : మేడపైన పిట్టగోడకు జారబడి ఓ వ్యక్తి ఫోన్​లో మాట్లాడుతున్నాడు. అయితే అకస్మాత్తుగా ఆ పిట్టగోడ కూలడంతో పక్కనే ఉన్న రేకుల ఇంటిపై అతడు పడిపోయాడు. దీంతో ఆ రేకుల ఇంట్లో నిద్రిస్తున్న దంపతులు, కుమారుడికి తీవ్ర గాయాలు కాగా, భర్త ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. జారిపడిన వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం మున్సిపల్​ పరిధిలోని లక్ష్మీనగర్​లో దీపాకర్​ దాస్​ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు తన ఇంటిపై మూడో అంతస్థులో పిట్టగోడకు జారబడి ఫోన్​లో మాట్లాడుతున్నాడు. అయితే అకస్మాత్తుగా పిట్టగోడ కూలడంతో దాంతో సహా దీపాకర్​ దాస్​ కింద ఉన్న రేకుల షెడ్​ ఇంటిపై పడిపోయాడు. ఆ రేకుల ఇంటి లోపల ఒడిశా రాష్ట్రానికి చెందిన జయదేబ్​ మహాకుద్​, సబిత దంపతులు నివాసం ఉంటున్నారు.

పిట్టగోడ వారిపై పడడంతోనే : తెల్లవారుజాము కావడంతో వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పిట్టగోడ మీద పడటంతో తీవ్ర గాయాలతో భార్యాభర్తలు అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. వాళ్ల కుమారుడు రాకేశ్​కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే జయదేబ్​ మాత్రం ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన భార్య సబిత, వారి కుమారుడికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అలాగే ఫోన్​లో మాట్లాడుకుంటూ కిందపడిన దీపాకర్​ దాస్​ కాలుకు తీవ్ర గాయం అయింది. అతడిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఐడీఏ బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వర్షం నింపిన విషాదం - బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు దుర్మరణం - Wall Collapse in Hyderabad

Rainfall in Telangana : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. హనుమకొండలో ఇంటి గోడ కూలి ముగ్గురి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.