ETV Bharat / state

ఆన్​లైన్ పేమెంట్​తో మొదలైన లవ్​స్టోరీ - భర్త, పిల్లలను వదిలి లండన్​ నుంచి వచ్చేలా చేసింది - WOMAN LEAVES FAMILY FOR BOYFRIEND

ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే వదిలి వచ్చిన భార్య - మాయమాటలతో మహిళను ఆకర్షించిన ట్యాక్సీ డ్రైవర్​ - భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు

Woman Leaves Family For Boyfriend
Woman Leaves Family For Boyfriend (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 12:44 PM IST

Woman Leaves Family For Boyfriend : భర్తకు రూ.లక్షల్లో వేతనం, బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఏ లోటు లేని విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న ఆమె ఓ ట్యాక్సీ డ్రైవర్​ మాయమాటలకు ఆకర్షితురాలైంది. కట్​ చేస్తే భర్తను, పిల్లలను కూడా కాదని లండన్​ నుంచి హైదరాబాద్​ నగరానికి వచ్చింది. ఆమె భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్టీఐఏ పోలీసులు గోవాలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం లండన్​ విమాన సర్వీస్​లో భర్త వద్దకు పంపించడంతో కథ సుఖాంతమైంది.

అసలేం జరిగిందంటే? : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్​ అల్వాల్​కు చెందిన జంటకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వారు ప్రస్తుతం లండన్​లో ఉంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన తల్లి హైదరాబాద్​లో మృతి చెందగా అస్తికల నిమజ్జనం కోసం ఆమె నగరానికి వచ్చింది. ఓ ట్యాక్సీని అద్దెకు తీసుకుని తిరిగాక రుసుమును ఆన్​లైన్​ ద్వారా చెల్లించింది. ట్యాక్సీ డ్రైవర్​ శివ ఆమె నంబరును సేవ్​ చేసుకుని ఆమెతో చాటింగ్​ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే అతడి మాయమాటలకు వివాహిత ఆకర్షితురాలైంది. సెప్టెంబరు 16న ఆమె భర్త తల్లి మృతి చెందడంతో ఆయన ఒంటరిగా హైదరాబాద్​కు వచ్చారు.

ప్రియుడి బర్త్​ డే కోసం పిల్లలను విడిచిపెట్టి : పిల్లలను విడిచిపెట్టి ఆమె కూడా సెప్టెంబరు 30న ఎవరికీ తెలియకుండా ప్రియుడి బర్త్​ డే వేడుకల కోసమని హైదరాబాద్ వచ్చేసింది. అమ్మ ఇంటికి రావడం లేదని పిల్లలు చెప్పడంతో భర్త వెంటనే భార్యకు ఫోన్​ చేశాడు. అయినప్పటికీ ఎలాంటి స్పందనా లేదు. దీంతో కంగారుపడి ఆయన లండన్​ వెళ్లి ఆరాతీయగా భార్య హైదరాబాద్​ వెళ్లినట్లు తెలిసింది.

మరోసారి మొబైల్​లో సంప్రదించగా ఆమె నంబర్​ కలిసింది. ఈ నెల 5న లండన్​ రావడానికి టిక్కెట్ తీసుకున్నానని ఓసారి, ఎయిర్​పోర్టుకు బయలుదేరానని నమ్మించింది. ఇంకోసారి ఓ ట్యాక్సీ డ్రైవర్​ కిడ్నాప్​ చేసి శంషాబాద్​లోని ఓ ప్రైవేటు హాస్టల్​లో ఉంచాడని మాయమాటలు చెప్పేది. ఆందోళనకు గురైన ఆమె భర్త స్నేహితులకు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్​ఫోన్​ టవర్​ లోకేషన్​ ఆధారంగా ఆమె గోవాలో ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే వెళ్లి, ఆమెను తీసుకొచ్చి లండన్​కు పంపించారు. దీనంతటికీ కారణమైన ట్యాక్సీ డ్రైవర్​ శివపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వలపు వల - ఉచ్చులో చిక్కి విలవిల - ప్రేమ పేరిట బాలికలపై పంజా - Men Cheating Girls in Name of Love

పెళ్లి చేసుకుంటానంటూ.. టిక్‌టాకర్‌ వలపు వల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.