A Married Woman Filed Case Against Her Husband : మేనకోడలు వరుసైన బాలిక(14)పై రెండు సంవత్సరాల కిందట అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. అనంతరం పెద్దల సమక్షంలో వివాహం చేసుకొని బిడ్డ పుట్టిన తరువాత ఆ బాలికపై శారీరకంగా, మానసికంగా వేధింపులకు దిగాడు. ఆ వేధింపులు భరించలేని బాలిక భర్త, అత్తామామలపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈ ఘటన విజయవాడలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలానికి చెందిన బాలిక(14) తల్లిదండ్రులు కూలి పనుల నిమిత్తం 2022లో విజయవాడకు వలస వచ్చారు. బాలిక 9వ తరగతి చదువుతుండగా ఆమెకు మేనమామ వరుసైన అనే వ్యక్తి ప్రేమించమంటూ వేధించేవాడు. ఈ క్రమంలోనే బాలికను తన అక్క ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
బాలికపై శారీరకంగా, మానసికంగా వేధింపులు : విషయం బయటకు పొక్కడంతో కుటుంబ పెద్దలు కలుగజేసుకుని ఇద్దరికీ 2022లో వివాహం చేశారు. ప్రస్తుతం వారికి 10 నెలల బాబు సైతం ఉన్నాడు. అయితే కొద్దికాలంగా భర్త, అత్తామామలు శారీరకంగా, మానసికంగా బాలికపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ వేధింపులు భరించలేని బాలిక బూర్జ పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేసింది. బాలిక వయస్సు 16 సంవత్సరాలే కావడంతో పోలీసులు ఈ ఘటనను తీవ్రమైన నేరంగా పరిగణించారు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులపై అత్యాచారం, పోక్సో వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేరం జరిగింది మొత్తం విజయవాడలో కావడంతో పోలీసులు కేసును బూర్జ పోలీస్‌స్టేషన్ నుంచి విజయవాడ బదిలీ చేశారు. గుణదల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కత్తులతో ఇద్దరు మహిళలనీ బెదిరించి మరీ ఇలా : ఉపాధి కోసం వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చిన అత్తాకోడలిని కత్తులతో బెదిరించి మరీ నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కొద్దిరోజుల క్రితం సత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. అర్ధరాత్రి రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు మహిళలపై, వారి భర్తలపై దాడికి తెగబడిన అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించి మొత్తానికి వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
"అత్తా కోడళ్లపై అత్యాచారం" కేసు - 48గంటల్లో ఛేదించిన పోలీసులు - నిందితుల్లో ముగ్గురు మైనర్లు
'మెట్టినింటిలో అత్యాచారం జరిగితే FIR నమోదు చేయాల్సిందే'- సుప్రీంకోర్టులో లాయర్ కొలిన్ వాదన!