A Man Arrested for Trying to open The Doors of a Plane : విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలు, మద్యం మత్తులో విమాన సిబ్బంది సహా తోటి ప్యాసింజర్లపై దాడుల ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి గగనతలంలో ప్రయాణిస్తుండగా విమానం తలుపులను తెరిచే ప్రయత్నాలు చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇలాగే చేసి కటకటాలపాలయ్యాడు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం
హైదరాబాద్ నగరంలోని గాజులరామారానికి చెందిన అనిల్ (35) అనే వ్యక్తి ఓ వ్యాయామశాలలో శిక్షకుడు (జిమ్ ట్రైనర్). అయితే ఇటీవల అతడు దైవదర్శనం కోసమని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి వెళ్లాడు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో విమానంలో బయలుదేరాడు. ఫ్లైట్ గగనతలంలో ప్రయాణిస్తుండగా, అనిల్ తన తోటి ప్రయాణికులతో కాస్త అనుచితంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన ఎయిర్‌లైన్స్ సిబ్బంది అతడిని అక్కడి నుంచి తీసుకొచ్చి, కాస్త మందలించి క్యాబిన్ వద్ద ముందు సీట్లో కూర్చోబెట్టారు.
విమానంలో ప్రయాణికుడు హల్చల్.. సీనియర్ అధికారిపై దాడి.. మెల్లగా మాట్లాడమన్నందుకే!
అంతమంది ముందు తన సీట్లోంచి తీసుకొచ్చి, మందలించి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టడాన్ని జీర్ణించుకోలేని అనిల్ విమానం తలుపులను బలవంతంగా తీయడానికి ప్రయత్నించాడు. అతడి హంగామాను విమాన సిబ్బంది, ప్రయాణికులు కలిసి అడ్డుకున్నారు. అనంతరం శంషాబాద్‌లో విమానం దిగగానే అతడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మల, మూత్ర విసర్జన చేసి : గతంలో ఇలాంటి ఘటనలు ఎయిర్ ఇండియా విమానాల్లోనూ జరిగాయి. ముంబయి నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్ఇండియా ఏఐసీ 866 విమానంలో ఓ ప్రయాణికుడు మల, మూత్ర విసర్జన చేశాడు. అంతే కాకుండా అక్కడే ఉమ్మి వేశాడు. ప్రయాణికుడి దుష్ప్రవర్తనను గమనించిన క్యాబిన్ సిబ్బంది అతడిని హెచ్చరించారు. ఆ తర్వాత దిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
65ఏళ్ల ఏజ్‌లో రోమియో వేషాలు- ఆమెపై ఇంటిపై విమానం తోలుతూ, టమాటాలతో కొడుతూ టీజింగ్