ETV Bharat / state

సికింద్రాబాద్‌ ప్యాట్నీసెంటర్‌లో 'నకిలీ' మనుషుల తయారీ - ఎలా చేస్తున్నారో తెలిస్తే షాక్​ అంతే! - GANG CREATING FAKE CERTIFICATES

నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఫేక్​ మనుషులను సృష్టిస్తున్న గ్యాంగ్ - రాష్ట్రంలో తిష్ఠ వేసిన దేశ, విదేశాలకు చెందిన వేల మంది - ఎటునుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందోనని పోలీసుల ఆందోళన

Fake Certificates
Fake Certificates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2024, 9:11 AM IST

Fake Certificates : కులం.. మతం.. ప్రాంతం.. ఎక్కడ నుంచి వచ్చినా.. నగరంలోనే పుట్టిపెరిగినట్లు పత్రాలు సృష్టించగలరు. అక్షరాలు మార్చినంత తేలికగా నకిలీ మనుషులను తయారు చేయగలరు. సికింద్రాబాద్‌ ప్యాట్నీసెంటర్‌లో ఆర్‌ఎస్‌ ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్‌ ముసుగులో నకిలీ పత్రాల తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ హైటెక్‌ దందాతో దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది దర్జాగా భారతీయులుగా చెలామణీ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆన్‌లైన్‌ సెంటర్‌ కేంద్రంగా నకిలీ ఓటర్, ఆధార్, జననం పత్రాలను తయారీ చేస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలు కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. కీలక నిందితుడు రాజ్‌కుమార్‌ నకిలీ పత్రాలు తీసుకుని వాటి ద్వారా సంపాదించిన పాస్‌పోర్టులతో సరిహద్దులు దాటినట్లు గుర్తించారు. గత ఎన్నికల్లో నకిలీ ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. నిందితుల వద్ద గుర్తించి 50వేల నకిలీ ఓటరు గుర్తింపుకార్డులు మూడు శాసనసభ నియోజకవర్గాల్లోనే ఉన్నట్లు నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తున్న కొత్తకోణాలు అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.

విదేశీయులు, నేరస్థులు నకిలీ పత్రాలతో పాస్​పోర్టులు పొందటం క్షేత్రస్థాయిలో నిఘావర్గాల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ ఆర్​ఎస్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ ముసుగులో 9 ఏళ్ల క్రితమే మోసాలకు ప్రారంభించాడు. ఆధార్​కార్డుల్లోని పేరులో తప్పులను సవరించమంటూ అధికశాతం పౌరులు ఇతడి వద్దకు వెళ్లేవారు. ఒకట్రెండు అక్షరాలను మార్చటం ద్వారా పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు. క్రమంగా నకిలీ పత్రాలు సృష్టించేంత స్థాయికి చేరాడు. జీహెచ్‌ఎంసీ కంప్యూటర్‌ ఆపరేటర్, పాస్‌పోర్టు ఏజెంట్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పెద్దల పేరుతో జనన ధ్రువపత్రాలు తీసుకునేందుకు నిబంధనలు అడ్డురావటంతో మైనర్ల పేరిట వాటిని తీసుకునేవారు. అక్కడ వయసు మార్చి ఓటరు, ఆధార్‌కార్డులు పొందేవారు.

ధ్రువపత్రాలు పోయాంటూ పత్రికల్లో ప్రకటనలు : ఆ రెండింటితో కుల ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసేవారు. దాని కోసం ఆయా సామాజికవర్గ సంఘ నేతల సంతకాలు తీసుకొని తహసీల్దార్‌ కార్యాలయాల్లో చక్రం తిప్పేవారు. నకిలీ రబ్బరుస్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో అధికార యంత్రాంగాన్ని ఏమార్చారు. కొన్నిసార్లు అసలు ధ్రువపత్రాలు చోరికి గురయ్యాయని, పోయాయంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అసలు పత్రాలకు దరఖాస్తు చేసి సొంతం చేసుకునేవారు.

నేపాల్‌కు చెందిన సుమారు 19 వేల మందికి ఓటరు గుర్తింపు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు ఇప్పించారంటే ఏ స్థాయిలో దందా సాగించారనేది అర్థం చేసుకోవచ్చు. ఈ ముఠా వద్ద నుంచి పత్రాలు పొందిన సగం మంది అసలు పేరు, చిరునామా పూర్తిగా నకిలీవేనని పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరిలో కొందరు పేరుతోపాటు కులం, మతం మార్చుకోని విదేశాలకు చేరటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఎంతమంది అసాంఘికశక్తులున్నారనేది గుర్తించటం పోలీసులకు సవాల్‌గా మారింది.

రేటు నిర్ణయించి మరీ వసూళ్లు : నకిలీపత్రానికో రేటు నిర్ణయించి మరీ వసూలు చేశారు. జనన ధ్రువపత్రం, ఓటరు, ఆధార్, పాన్‌కార్డులు ఒక్కోదానికి రూ.10-20 వేల వరకూ వసూలు చేశారు. గత ఎన్నికల సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక నియోజకవర్గంలోనే 20వేల ఓటరు గుర్తింపుకార్డులకు ఈ ముఠా సహకరించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల వ్యవధిలోనే ప్రధాన నిందితుడు నకిలీ పత్రాలతో రూ.90లక్షల సంపాదించినట్లు సమాచారం.

విదేశీయుల చేతిలోకి చేరిన నకిలీ పత్రాలు, గుర్తింపుకార్డులతో ఏ వైపు నుంచి ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. సమాజంలో పెద్దలుగా చెలామణీ అవుతూ నకిలీ మనుషులుగా విదేశాలు చేరిన వారి వివరాలు సేకరించేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం. పాస్‌పోర్టు పరిశీలనలో ఖచ్చితంగా వ్యవహరించే పోలీసు(స్పెషల్‌బ్రాంచ్‌)అధికారులు కూడా నకిలీ దందాను పసిగట్టకపోవటం అనుమానాలకు తావిస్తోంది.

బైబ్యాక్ స్కీమ్ పేరుతో రూ.300 కోట్లకు టోకరా - 8 మంది నిందితుల అరెస్ట్

ఆన్​లైన్​లో లోన్​ తీయించి మరీ రూ. 30 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.