ETV Bharat / state

ప్రేమ పేరుతో కుమార్తెకు వేధింపులు - యువకుడికి పలుమార్లు తండ్రి వార్నింగ్ - ఎంతకీ వినకపోవడంతో? - FATHER COMMITTED SUICIDE IN GADWAL

ఏడాదిగా ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు - కుమార్తె వేధింపులకు గురి కావడంతో రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య - కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు

Daughter Love Father Suicide
Daughter Love Father Suicide (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2024, 9:19 AM IST

Updated : Nov 7, 2024, 10:14 AM IST

Daughter Love Father Suicide : ప్రేమ పేరిట కుమార్తెను ఓ యువకుడు వేధిస్తే, మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. గద్వాల రైల్వే పోలీస్​ స్టేషన్​ పరిధిలో యువతి తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గద్వాలకు చెందిన వ్యక్తి గద్వాల రైల్వే స్టేషన్​లో హమాలీగా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమార్తె పట్టణంలోని ఓ పాఠశాలలో చదువుతోంది. ఈ క్రమంలో ఆ యువతిని పట్టణానికి చెందిన వినోద్​ అనే యువకుడు ప్రేమ పేరిట తరచూ వేధిస్తుండేవాడు. ఇలా ఏడాది నుంచి బాలికను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయం యువతి తండ్రికి తెలియడంతో ఆయన తన కుమార్తెను చదువు మాన్పించేశాడు.

వినోద్​ను ప్రవర్తన మార్చుకోవాలని యువతి తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. మరికొన్ని సందర్భాల్లో కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి పలుమార్లు యువకుడికి వార్నింగ్​ ఇచ్చారు. అయినా ఆ యువకుడిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. మారకపోగా యువతిని ఇంకా ఎక్కువగా వేధించడం ప్రారంభించాడు. కుమార్తెకు వేధింపులు ఎక్కువ కావడంతో కలత చెందిన తండ్రి, గద్వాల మండలం వెంకంపేట శివారులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు : వెంటనే సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బలవన్మరణంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్య : ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా అత్తాపూర్​లో ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమ విఫలమైందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడు మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన అత్తాపూర్​ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పెళ్లి చేసుకోమని అడిగిన గర్ల్​ఫ్రెండ్.. చచ్చిపోమని పురుగుమందు కొనిచ్చిన లవర్.. చివరకు?

అందరిముందు అవమానం - ఆ స్టూడెంట్​ను కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేసింది

Last Updated : Nov 7, 2024, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.