ETV Bharat / state

వయసు 70- ప్రపంచ రికార్డులు 36! మైదానంలో ఆమె 'సుహాసిని' - 70 YEARS OLD WOMAN ATHLETE

క్రీడలకు వయసు అడ్డురాదంటూ నిరూపిస్తున్న సుహాసిని- 36 ప్రపంచ రికార్డులతో ఆదర్శంగా నిలుస్తున్న లక్ష్మీ సుహాసిని

70_years_old_woman_athlete_from_nellore_district
70_years_old_woman_athlete_from_nellore_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2024, 4:18 PM IST

70 Years Old Woman Athlete From Nellore District : సాధారణంగా 60 ఏళ్లు వచ్చాయంటే చాలు రామా, కృష్ణా అంటూ చాలా మంది పెద్దలు విశ్రాంతి తీసుకుంటారు. అంతెందుకు యువత సైతం కొంచెం దూరం నడిచినా వర్కవుట్ చేసినా ఇట్టే అలసిపోతారు. ఆమె మాత్రం ఏడు పదుల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా అలుపెరగకుండా పరుగులు తీస్తున్నారు. క్రీడలకు వయసు అడ్డురాదంటూ ప్రపంచ రికార్డులు సాధించి ఔరా అనిపిస్తున్నారు.

నవ్వుతూ ఎంతో చలాకీగా కనిపిస్తున్న ఆమె పేరు సుహాసిని. వయసెంతో తెలుసా? 70 పైమాటే. పేరుకు తగ్గట్టుగానే అడుగు పెట్టిన ఏ మైదానంలోనైనా విజయం ఎప్పుడు ఆమె వైపే ఉంటుంది. సుహసిని అడుగుపెడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. పరుగందుకుంటే పతకం పట్టాల్సిందే. ప్రపంచంలో ఏ మూల పోటీ జరిగినా వాలిపోతారు. మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ మెడల్స్ కొల్లగొడుతున్నారు. ఆగస్టులో స్వీడన్‌లో జరిగిన పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.

లక్ష్మీ సుహాసిని సొంతూరు గుంటూరు అయినా నెల్లూరులో స్థిరపడ్డారు. తెలుగు లెక్చరర్‌గా పని చేసిన ఈమె పదవీ విరమణ తర్వాత వెటరన్ క్రీడాకారిణిగా మారారు. మోకాలికి శస్త్రచికిత్స జరిగినా ఏమాత్రం బెరుకు లేకుండా జావెలిన్ త్రో, డిస్క్ త్రో, మారథాన్ వాకింగ్‌లో కఠోర శ్రమ చేశారు. నేటికీ 5కె రన్, రిలే రన్ పోటీల్లో శిక్షణ పొందుతున్నారు. క్రీడలకు వయసు అడ్డురాదని చాటిచెబుతున్నారు.

క్రీడల్లో సత్తా చాటుతున్న అక్కాచెల్లెళ్లు - అడ్డంకిగా మారిన ఆర్థిక ఇబ్బందులు - Vizianagaram Sisters Talent

సుహాసిని బహుముఖ ప్రజ్ఞాశాలి. జానపద కళాకారిణిగా కవయిత్రిగానూ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈమె రచనలకు మొల్ల జయంతి పురస్కారం, కవికోకిల, దువ్వూరు రామిరెడ్డి అవార్డులు పొందారు. చిత్ర కళతో లిమ్కా బుక్‌ఆఫ్ రికార్డులోనూ చోటు సంపాదించుకున్నారు.

'ఆటకు వయసు లేదు. నలభై ఏళ్లు దాటితే ఆడవాళ్లు ఆటలు ఆడతాం అంటే.ఈ వయసులో నీకు ఆటలు అవసరమా అనే ఇంటి వాతవరణమే ఉంటుంది. దాన్ని బద్దలు కొట్టుకు రావడమే గొప్ప విజయం. స్వీడన్​కు 109 దేశాల వాళ్లు వచ్చారు, ఒలంపిక్స్​లో రిటైర్డ్ ఛాంపియన్స్​ ,మాస్టర్​ అత్లెట్స్​ వెటరన్​ స్పోర్ట్స్​ పర్సన్స్​లా వచ్చారు. వాళ్లతో పోటీ పడటం చాలా జ్ఞానాన్నిచ్చింది నాకు .' -లక్ష్మీ సుహాసిని, వెటరన్ క్రీడాకారిణి

సుహాసిని ప్రతిభకు ఫిదా అయిన గూడూరు దువ్వూరు రమణమ్మ కళాశాల యాజమాన్యం ఎకో ఫ్రెండ్లీ కార్నర్ పేరుతో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. సుహాసిని సాధించిన 36 ప్రపంచ రికార్డులు, ట్రోఫీలు, చిత్రకళలను ప్రదర్శించి భావితరాల్లో స్ఫూర్తి నింపుతున్నారు.

"నువ్వేం ఆడతావ్"​ అన్నవాళ్లే ఇప్పుడు శభాష్​ అంటున్నారు - భవానీ నీకు సెల్యూట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.