500 LPG Cylinder Scheme Telangana 2024 : రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో (Congress Six Guarantees) ఒక్కో గ్యారంటీని అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మహాలక్ష్ములకు తీపి కబురు చెప్పింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాయితీపై వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్రమంలోనే తాజాగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
Gas Cylinder Scheme Telangana 2024 : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభా (Congress Chevella Meeting Today) వేదికగా ఇవాళ మహాలక్ష్మి పథకం కింద రాయితీ ధరపై 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ మార్గదర్శకాలు (Gas Cylinder Scheme Guidelines) విడుదల చేసింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి మరో పథకం అమలుకు సర్కారు పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ పథకం అమలు సంబంధించి తక్షణం నియమావళి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
6 గ్యారంటీల్లో మరో కీలక అడుగు - ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ పథకాలకు నేడు సీఎం శ్రీకారం
మరోవైపు ఇవాళ చేవెళ్లలో జరగనున్న సభలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనుంది. విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా ఆ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు పథకాన్ని వర్తింపచేయనుంది. మీటర్ రీడింగ్‌కు వెళ్లినప్పుడు దరఖాస్తుదారుల ఆధార్, తెల్లరేషన్ కార్డులను విద్యుత్ సిబ్బంది పరిశీలించారు. అయితే కొన్నిచోట్ల ఇంకా పరిశీలన పూర్తి కాలేదు. ఎంపికైన లబ్ధిదారులకు మార్చిలో జీరో విద్యుత్ బిల్లు ఇవ్వనున్నారు.
రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ పథకం గురించి మరిన్ని విశేషాలు
- మహిళా సాధికారత, పొగ రహిత వంట కోసం మహిళలకు రాయితీపై వంట గ్యాస్ రీఫిల్లింగ్ అందివ్వడం ఈ పథకం లక్ష్యం.
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో విధిగా మహాలక్ష్మి పథకం కింద రాయితీపై వంట గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలు మాత్రమే అర్హులు.
- దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఆ కుటుంబం తెలంగాణలో తప్పసరిగా తెల్ల రేషన్ కార్డు - ఎఫ్‌ఎస్‌సీ కలిగి ఉండాలి.
- ఈ ఆహార భద్రతా కార్డుతోపాటు తమ గృహ వంట గ్యాస్ కనెక్షన్ చురుకుగా వినియోగంలో ఉండి తీరాలన్న నిబంధన విధించిన ప్రభుత్వం.
- గత మూడు సంవత్సరాల సగటు వినియోగం ఆధారంగా ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని పౌరసరఫరాల శాఖ పేర్కొంది.
- గ్యాస్ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ ప్రభుత్వం చెల్లిస్తుందని జీవోలో వెల్లడి.
- లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బు బదిలీ చేయనున్న గ్యాస్ కంపెనీలు.
- మూడేళ్ల సరాసరి ఆధారంగా సిలిండర్లు ఇవ్వనున్న ప్రభుత్వం.
రూ.500కే గ్యాస్ సిలిండర్‌పై క్లారిటీ వచ్చేసింది - ముందుగా మొత్తం ధర చెల్లించాలి, ఆ తర్వాత!
రూ.500కే గ్యాస్ సిలిండర్ - లబ్ధిదారుల ఖాతాలోకి రాయితీ నగదు బదిలీనే